14-09-2025 12:00:00 AM
రాచమల్ల సిద్ధేశ్వర్ :
ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడిన తెలంగాణకు 2014 నుంచి పదకొండేళ్లుగా తీవ్ర అన్యాయం చేస్తున్న మోదీ ప్రభుత్వం వరదలొచ్చినప్పుడు కూడా ఆదుకోవడం లేదు. రాష్ర్టం లో ఆగస్టు చివరి వారంలో అకాల వర్షాలతో 10 జిల్లాలు అతులాకుతలమయ్యా యి. రాష్ర్ట ప్రభుత్వం ప్రాథమిక అంచనా ప్రకారం ఈ వరదలతో సుమారు రూ.5 వేల కోట్ల ఆస్తినష్టం జరిగింది. ఇంత నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించకపోవడం దురదృష్టకరం.
భారత రాజ్యాంగంలో ఫెడరల్ (సమాఖ్య) విధానానికి పెద్దపీట వేయడంతో మన దేశంలో ప్రజా స్వామ్యం పరిరక్షించబడింది. అయితే కేం ద్రంలో బీజేపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, కేంద్ర రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తికి విఘాతాలు కలుగుతున్నాయి. కేంద్రంలో అధి కారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెదన్న పాత్ర పోషించకుండా రాజకీయ కక్షతో ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలపై చిన్నచూపు చూపిస్తోంది.
తెలంగాణ ఆవిర్భా వంపై పలుమార్లు అక్కసు వెళ్లగక్కిన మోదీ నేతృత్వంలోని కేంద్రం రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాలపై, ప్రాజెక్టులపై, అభివృద్ధి పథకాలపై శీతకన్ను చూపిస్తూ వచ్చింది. చివరికి వరదల సమయంలోనూ, యూరియా పంపిణీలోనూ వివక్ష కనబరుస్తూ వచ్చింది. ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడిన తెలంగాణకు 2014 నుంచి పదకొండేళ్లుగా తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వరదలొచ్చినప్పుడు కూడా ఆదుకోవడం లేదు.
రాష్ర్టం లో ఆగస్టు చివరి వారంలో అకాల వర్షాలతో 10 జిల్లాలు అతులాకుతలమయ్యా యి. రాష్ర్ట ప్రభుత్వం ప్రాథమిక అంచనా ప్రకారం ఈ వరదలతో సుమారు రూ.5 వేల కోట్ల ఆస్తినష్టం జరిగింది. 2025లో ఇప్పటి వరకూ వర్షాలతో 20 మందికిపై గా చనిపోయారు. ఇంత నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించకపోవ డం దురదృష్టకరం. మోదీ ఆపద సమయ ంలోనూ రాష్ర్టంపై వివక్ష చూప డం ఇదే మి మొదటిసారి మాత్రం కాదు.
గత ఏ డాది వచ్చిన వరదల నష్టాన్ని ప్రాథమిక ంగా అంచనా వేసి రాష్ట్రానికి 5,423 కో ట్లు విడుదల చేయాలని 2024 సెప్టెంబర్ లో కోరిన రాష్ర్ట ప్రభుత్వం మొత్తం పరిస్థితులను అంచనావేసి రూ.11,713 కోట్ల నష్టం జరిగిందని కేంద్ర హోం శాఖకు నివేదించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై వివక్ష తో బీజేపీ సర్కారు తెలంగాణకు ఒక్క పైసా సహాయం చేయకుండా రాజకీయ కుట్రలకు తెరలేపి రాష్ర్ట విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదు.
కేంద్రం పట్టించుకోకపోయినా బాధితులను ఆదుకోవడ మే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వరద బాధితులకు తక్షణం సహాయం చేసింది. సమాఖ్య స్ఫూర్తిని అనుసరిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గతంలో జరిగిన వరద నష్టంతో పాటు ప్రస్తుత నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి ప్రత్యేక వరద సాయం కింద నిధులను మంజూరు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
పక్షపాత ధోరణి
రాష్ర్టంలో వరద విషయంలోనే కాదు. తెలంగాణ వ్యవసాయంపై, రైతులపై కూడా కేంద్రం పక్షపాతంతోనే వ్యవహరిస్తుంది. రాష్ర్టంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని అన్నదాతలు ఆనందిస్తే, యూరియా పంపిణీలో కేంద్రం చూపించిన వివక్షతో వారి ఆశలు ఆవిరవుతున్నా యి. దేశ వ్యాప్తంగా యూరియా సరఫరా పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండడంతో రాష్ర్టం కేంద్రంపై ఒత్తిడి తప్ప ప్రత్యక్షంగా ఏమీ చేసే పరిస్థితులు లేవు.
కేంద్ర ప్రభుత్వం కోతలతో సరఫరా చేస్తు న్న యూరియానే రైతులందరికీ దక్కేలా రాష్ర్ట ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయం రంగం ఫుం జుకొని దేశంలోనే అత్యధికంగా బియ్యం పండిస్తున్న రాష్ర్టంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తున్న దశలో కేంద్ర ప్రభుత్వం చర్యలు అన్నదాతలకు గొడ్డలిపెట్టుగా మా రాయి.
డిమాండ్‌కు తగ్గట్టు యూరియా సరఫరా లేకపోవడంతో అన్నదాతల్లో ఆగ్ర హం కట్టలు తెంచుకొని అక్కడక్కడ యూ రియా షాపులపై, యూరియా లారీలపై దాడులు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తెలంగాణపై వరదలు, యూరి యా అంశంలో మొదటి నుంచి రాష్ర్టంపై కేంద్ర ప్రభుత్వం వివక్షనే చూపిస్తూ వస్తుం ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన వాటాలపై, ప్రాజెక్టులపై కూడా అన్యాయమే జరుగుతుంది.
గత పదకొండేళ్ల కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎన్నడూ రిక్త హస్త మే. మూసీ సందరీకరణ, మెట్రో రెండో దశ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నవోద య విద్యాలయాల స్థాపన కోసం రాష్ర్టం వినతులను బుట్ట దాఖలు చేస్తోంది. రాష్ర్ట విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లు ఒక నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యా రం స్టీల్ ఫ్యాక్టరీ, ఐఐఎం, ఐటీఐఆర్ మం జూరు చేయలేదు.
కాజీపేట రైల్ కో ఫ్యాక్ట రీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ప్రయివేట్ రంగానికి పెద్దపీట వేస్తూ రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీతో రాష్ర్ట యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశిసే..్త ప్రస్తుత యూనిట్ నిర్వహణలో అధిక శాతం ప్రయివేట్ సంస్థలకు కట్టబెట్టుతుండడం తో అదో ప్రైవేటు సంస్థగామిగిలిపోనుం ది. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల నీటి ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోంది.
అన్నింటా అన్యాయమే!
కాంగ్రెస్‌పై కోపంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాలకు కూడా అన్యాయం చేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపగా పెండింగ్‌లో పెట్టారు. స్థానిక ఎన్నికల్లో వారికి 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకురాగా ఆమో దంపై కూడా తాత్సర్యం చేస్తుంది. మా నోటీ కాడ ముద్ద లాగొద్దని బీసీలు కోరుతున్నా కుట్రలకు తెరలేపింది.
90 శాతా నికిపైగా ఉన్న బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు జానాభా ప్రాతిపదకన న్యాయం చేసేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేయడం కరెక్టు కాదు. రాష్ర్ట బీజేపీ తరఫున ఇద్దరు కేంద్ర మంత్రులు సహా ఎని మిది మంది ఎంపీలున్నా వారు తెలంగాణ హక్కులపై, బీసీల కోసం గళమెత్తరు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం సమా ఖ్య స్ఫూర్తిని మరువకుండా తెలంగాణకు న్యాయం చేయాల్సిన అవసరముంది.
వ్యాసకర్త సెల్: 9848174377