14-05-2025 10:52:59 PM
జిల్లా సంక్షేమ అధికారి లెనినా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): గృహిణిగా, ఉద్యోగినులుగా మహిళల సేవలు వెలకట్టలేనివని జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి స్వర్ణలత లెనినా(District Welfare Officer Swarnalatha Lenina) అన్నారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఇటీవల పదవీ విరమణ చేసిన సీడీపీఓ కనకదుర్గ, హెడ్ మాస్టర్ మేకల జ్యోతి రాణి, రేగళ్ళ అంగన్వాడీ టీచర్ రమాదేవి లకు ఐసిడిఎస్ లక్ష్మీదేవిపల్లి సెక్టార్-1 ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సన్మానం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిడబ్ల్యూ ఓ స్వర్ణలత లెనినా మాట్లాడుతూ... పదవీ విరమణ చేసి సన్మానం పొందిన ముగ్గురు మహిళా ఉద్యోగుల సేవలు సమాజంలో ప్రతి ఒక్కరికీ స్పూర్తిగా నిలుస్తారన్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకుని కొత్త కరెంట్ మీటర్లు, వైరింగ్, లైట్లు, ఫ్యాన్లతో కూడిన విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారని చెప్పారు. పాల్వంచ సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న గౌరవ అతిథిగా పాల్గొన్నారు. సూపర్ వైజర్ K.రమాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పద్మ వందన సమర్పణ చేశారు. అంగన్వాడీ టీచర్ లు, ఆయాలు, సిబ్బంది, సన్మాన గ్రహీతల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.