02-10-2025 12:38:35 AM
వైద్యం అందక ప్రజల ఇక్కట్లు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగు
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 1 (విజయక్రాంతి):నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆ యుష్మాన్ ఆరోగ్య మందిర్ జాడ కనిపించ డం లేదు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ ఒకటవ డివిజన్ లో గల బొల్లూరి గూడెం డివిజన్ ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఏర్పాటు చేశారు.
ఆరోగ్య మందిర్ జాడ కనిపించక రోగాలతో బాధపడుతున్నామని డివి జన్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ ర్షాకాలం ఆపై సీజనల్ వ్యాధులు ప్రబలటంతో ప్రజల తీవరేబ్బందులను ఎదుర్కొం టున్నారు. ప్రభుత్వం నిరుపేదలకు సర్కారు వైద్యం అందించాలని ఉద్దేశంతోనే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఏర్పాటుచేసిన నిర్వహణ జరగటం లేదు.
వైద్యం అందక ప్రజల ఇక్కట్లు..
పాల్వంచం మండలం ఉలవనోరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇవాళ బొ ల్లోరుగూడెంలో ఆయుష్మాన్ ఆరోగ్య మంది ర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరి అడ్రస్ తెలియక నాన్న అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు బోర్డులు పెట్టి అందిస్తారు ఇక్కడ మాత్రం బోర్డు ఏర్పాటు చేయడం లేదని, దీంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఎక్కడ ఉందో ప్రజలు గుర్తించలేకపోతున్నారు.
వ్యతిరేక ప్రవేట్ ఆసుపత్రులకు పరుగు
ఆ ప్రాంతంలో ఉన్న నిరుపేదలంతా మారుమూల ప్రాంతంలో ఉన్న వారు, అనారోగ్యానికి గురైతే వచ్చి వైద్యం చేయించుకునేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ను గుర్తించి ప్రజలకు చేరువలో సర్కారు వై ద్యాన్ని అందించాలని లక్ష్యంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఏర్పాటు చేశారు.
సి బ్బంది కొరత కారణంగా రోగులకు ఆశించిన వైద్యం అందకపోవడంతో తప్పని పరిస్థి తిలో డివిజన్లో నీ ప్రజలంతా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికి పో తున్నారు. జిల్లా స్థాయి అధికారులు కల్పించుకొని బొల్లోరు గూడెం లో ఏర్పాటు చేసి న ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చర్యలు తీసుకో వాలని ప్రజలుకోరుతున్నారు.