calender_icon.png 24 December, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న ఎస్పీ డాక్టర్ వినీత్

24-12-2025 12:11:48 AM

నారాయణపేట, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా ఎస్పి డాక్టర్ వినీత్ మంగళవారం ఒక వృద్ధుడిని కాపాడేందుకు స్వయంగా చర్యలు తీసుకుని మానవత్వం చాటుకున్నారు.

కోస్గి పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి  ఎ. రేవం త్ రెడ్డి  పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు  వెళ్తున్న సందర్భంగా దామర గిద్ద దాటిన తరువాత  రోడ్డుపై వెళ్తున్న ఒక ముసలి వృద్ధుడు  అకస్మాత్తుగా కళ్ళు తిరిగి రోడ్డుపై పడిపోవడం గమనిం చిన ఎస్పీ వెంటనే తన వాహ నాన్ని ఆపించి అక్కడ ఎటు వంటి ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించిన ఎస్పీ తమ పోలీసు ఎస్కార్ట్ వాహనంలోనే ఆ వృద్ధుడిని సమీపంలోని ప్రభుత్వ ఆసు పత్రికి తరలించేందుకు ఆదేశా లు జారీ చేశారు.

ఆసుపత్రిలో అవసరమైన చికిత్స అందేలా అధికారు లకు సూచనలు ఇచ్చి ఇచ్చారు. ఎస్పి మానవత్వం, బాధ్యతా భావంతో వ్యవహరించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. భద్రతా విధులతో పాటు ప్రజల ప్రాణ రక్షణే పోలీసు శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని మరోసారి చాటిచెప్పిన జిల్లా ఎస్పీ చర్యను స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.