calender_icon.png 28 August, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైరవీలకు తావు లేకుండా సమస్యల పరిష్కారం

16-12-2024 02:59:05 PM

ఎస్పీ డీవి శ్రీనివాస్ రావు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పైరవీలకు తావు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి వినతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ డీవి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి సమయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గర అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందన్నారు. సివిల్ కేసులను కోర్టు, రెవెన్యూ ద్వారా పరిష్కరించుకోవాలని అర్జీదారులకు సూచించారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. ఫిర్యాదుదారుల నుండి నేరుగా వినతులు స్వీకరిస్తూ సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అర్జీదారులు అందజేసిన ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.