calender_icon.png 23 July, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎస్పీ

23-07-2025 12:41:57 AM

కామారెడ్డి, జూలై 22 (విజయక్రాంతి): వన మహోత్సవంలో భాగంగా జిల్లా ఎస్పీ ఎమ్. రాజేష్ చంద్ర మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సిబ్బందితో కలిసి మొక్కలు నాటి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పచ్చని చెట్లు ప్రాణవాయువు అందిస్తాయనీ, పచ్చదనమే భవిష్యత్తు అని అన్నారు.

ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి (అడ్మిన్) కే నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డి.ఎస్.పి వై శ్రీనివాసరావు, బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సిఐలు ఎస్‌ఐలు రిజర్వే ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.