calender_icon.png 14 October, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి

14-10-2025 12:40:45 AM

- మరుగుదొడ్లు, బస్‌షెల్టర్ల నిర్మాణాలకు రూ.20 లక్షలు మంజూరు

-త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం : ఎమ్మెల్యే కూనంనేని 

భద్రాద్రికొత్తగూడెం/సుజాతనగర్, అక్టోబర్ 13, (విజయక్రాంతి) : నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన కనీస మౌలికవసతుల కల్పనపై కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రేత్యేక దృష్టి సారించారు. వివిధ పథకాల్లో మంజూరైన నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుండగా, అనేక అభివృద్ధిపనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా సుజాతనగర్ మండల కేంద్రంలో మరుగుదొడ్లు, బస్ షెల్టర్, వేపలగడ్డలో మరో బస్ షెల్టర్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.

ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ సుజాతనగర్ మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్ధం మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.10లక్షలు, సుజాతనగర్ మండల కేంద్రం, వేపలగడ్డ గ్రామ సెంటర్లో బస్ షెల్టర్ల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే నిధులతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అభివృద్ధి పనులు, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి వివక్ష ఉండబోదని, నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన అవసరాలు గుర్తించి ఇప్పటికె ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత శాఖలకు అందించామని తెలిపారు. ప్రా ధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.