19-09-2025 12:00:00 AM
ఎంపీ గోడెం నగేష్
కాగజ్‌నగర్, సెప్టెంబర్ ౧8 (విజయక్రాం తి): కేంద్ర ప్రభుత్వ సహాయంలోనే రైల్వే అభివృద్ధితో పాటు నూతన రైళ్లను ప్రారంభించినట్లు ఎంపీ నగేష్ అన్నారు. బుధవా రం కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో సికింద్రాబా ద్- నాగ్ పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్‌కు జెండా ఊపి ప్రారంభించిన ఆదిలాబా ద్ ఎంపి గోడెం నగేష్, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని రైళ్లను నిలుపుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. వందే భారత రైలు కాగజ్‌నగర్‌లో నిలుపుదలకు కృషి చేసిన కేంద్ర మంత్రులును ఈ సందర్భంగా అభినందించారు. ఈ సమావేశంలో రైల్వే అధికారులు, బిజెపి నాయకు లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.