calender_icon.png 29 December, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘శ్రీచైతన్య’ ఉద్యోగుల స్పోర్ట్స్ ఉత్సవ్

29-12-2025 12:08:13 AM

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే అతిపెద్ద విద్యావ్యవస్థ, శ్రీచైతన్య విద్యాసంస్థలు నిర్వహించిన స్పోర్ట్స్ ఉత్సవ్ విజయ వంతంగా ముగిసింది. హైదరాబాద్‌లోని అన్నీ బ్రాంచీలలోని వేలాదిమంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది 12 జోన్లుగా వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తూ అథ్లెటిక్స్, ఇండోర్ -అవుట్డోర్ గేమ్స్, రిక్రియే షనల్ అంశాలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. సిబ్బందిలో పోటీతత్వం, జట్టు భావ న, నాయకత్వ లక్షణాలను వెలికితీసే ఈ క్రీడా వేడుక అందరి ప్రశంసలను అందుకుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన బహు మతి ప్రదాన కార్యక్రమంలో క్రికెట్, వాలీబాల్, టెబుల్ టెన్నీస్, క్యారమ్, చెస్, పికెట్ బాల్ వంటి విభాగాలలో రాణించిన విజేతలకు మెడల్స్, ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన, డైరెక్టర్లు శ్రీధర్, టి నాగేంద్ర కుమార్ హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సుష్మ మా ట్లాడుతూ.. బోర్డ్‌ఎగ్జామ్స్‌తో పాటు ఐఐటీజేఈఈ, నీట్, ఒలింపియాడ్‌లో ఆలిండియా అగ్రగామిగా ఉన్న శ్రీచైతన్యలో విద్యతో పాటు శారీరక వికాసానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వలక్షణాలు, ఓర్పు వంటి విలువలను విద్యార్థులు నేర్చుకుంటారని చెప్పారు.