calender_icon.png 17 July, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ దుర్గాభవాని ఉత్సవాలు

16-06-2025 12:00:00 AM

చేగుంట, జూన్ 15 : మృగశిర కార్తెను పురస్కరించుకొని చేగుం ట మండల పరిధిలోని చందా యిపేట గ్రామంలో వెలిసిన మాత శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవా లు ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. మొదటిరోజు మాజీ ఎంపీటీసీ  పబ్బ శ్రీనివాస్ గుప్త కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించడం జరిగింది.

ఉదయం నుండి శ్రీ  రేణుక దుర్గమ్మ అమ్మవారికి వేద పండితులతో పంచామృత అభిషేకం, పట్టు వస్త్రాలతో అత్యంత సుందరంగా వివిధ పుష్పాలతో అలంకరణ, విశేషాలంకరణ ప్రత్యేక పూజలు జరిగాయని తెలిపారు. సాయంత్రం దేవుని చెరువులో గల  పోచమ్మ, ముత్యా లమ్మ, మత్తడి పోచమ్మ , ఆలయాలకు గ్రామస్తులు బోనాలు తీశారు. ఈ కార్యక్రమంలో చేగుంట పట్టణతో పాటు వివిధ గ్రామాలలోని ప్రజలు పాల్గొన్నారు.