10-09-2025 12:03:49 AM
-త్రాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ లైన్లు, సౌకర్యాల కల్పన
-ఏదులాపురం మునిసిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి, మద్దులపల్లిలో పర్యటించి రోడ్డు పనులకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, సెప్టెంబర్ 9(విజయ క్రాంతి): ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, కొత్తగా ఏర్పడ్డ మునిసిపాలిటీ ఏ దులాపురం అభివృద్ధి కి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌ జింగ్ సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మంగళవారం ఏదులాపురం మునిసిపాలిటీ తెల్దారుపల్లి, మద్దులపల్లి లలో మంత్రి పర్యటించారు. మంత్రి పర్యటన లో తెల్దారుపల్లి ముత్యాలమ్మ గుడి నుండి ధోభీఘాట్ వరకు ఎన్‌ఎస్పీ కెనాల్ మీదుగా రూ. 1.54 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్ పనులకు శంఖుస్థాపన, మద్దులపల్లి ఆర్ అండ్ బి రో డ్ నుండి లుంబినివనం వరకు రూ. 69 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ, తెల్దారుపల్లి ప్రాంతానికి ప్రజా ప్రభు త్వం వచ్చిన 20 నెలల్లోనే రూ. 12.35 కోట్లు మంజూరు చేసినట్లు, వీటితో కొన్ని పనులు పూర్తి కాగా, కొన్ని శంఖుస్థాపన, కొన్ని టెం డర్ దశలో ఉన్నట్లు తెలిపారు.
అదే విధంగా మద్దులపల్లి ప్రాంతానికి బీటీ రోడ్లు, అంతర్గత సిసి రోడ్లు నిర్మించుకున్నామన్నారు. రా బోయే కొద్ది రోజుల్లో ప్రతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగలేకపోయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమ లు చేస్తున్నామన్నారు. 200 యూనిట్ల ఉచి త విద్యుత్ సరఫరా, 500 రూపాయల గ్యా స్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు భరోసా కల్పించామని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ ద్వారా పేదలకు సన్న బి య్యం సరఫరా చేస్తున్నామని, గత ప్రభు త్వం నిర్లక్ష్యం వహించిన రేషన్ కార్డు సమస్యలను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరించి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని అన్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు, రేషన్ కార్డుల్లో సభ్యుల చేర్పులు చేశామన్నారు. పేదలకు అండగా ఉండే మన ప్రభుత్వం మొదటి విడతగా రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసామని అన్నారు.
నియోజకకగానికి 3500 ఇండ్లు మంజూరు చేసినట్లు, త్వరలో రెండో విడత ఇస్తామని అన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, విడతల వారిగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని మంత్రి అ న్నారు. మంత్రి పర్యటన లో తెల్దారుపల్లి లో అర్హులైన 24 మందికి ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు.
మద్దులపల్లి లో 22 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరినాథ బాబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఆర్ అండ్ బి ఇఇ పవార్, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.