calender_icon.png 9 September, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యూహాత్మక ఎత్తుగడే బీజేపీ బలం!

07-09-2025 12:10:18 AM

డాక్టర్ తిరునహరి శేషు :

దశాబ్ద కాలంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కమ్యూనిస్టు పార్టీని వెనక్కి నెట్టి దేశంలో ఒక బలమైన రాజకీయ శక్తి గా ఎదగడంలో ఆ పార్టీ నాయకుల రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలే బలమన్న  విషయం స్పష్టమవుతుంది. మూడు పర్యాయాలు వరుసగా సాధారణ (లోక్‌సభ) ఎన్నికల్లో విజయం సాధించి నెహ్రూ రికార్డుని సమం చేయడమే కాదు, 20 రాష్ట్రా ల్లో బీజేపీ అధికారంలో ఉండటం ఆ పార్టీ బలాన్ని చాటి చెబుతుంది.

భారతీయ జన తా పార్టీకి ఈ స్థాయి విజయాలు ఎలా సాధ్యమవుతున్నాయి అనేది రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ప్రతికూలతలను సైతం అనుకూలతలుగా మార్చుకొని విజయాలు సాధించే వ్యూహాలతో పాటు, విపక్షాల బలహీనతల వల్ల బీజేపీ విజయాలు అప్రతిహాతంగా కొనసాగుతున్నాయి అనే అభిప్రాయం వ్యక్తమ వుతుంది.

ఒక దశాబ్ద పాలన తరువాత సహజంగా ప్రభుత్వాలపై ఏర్పడే ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను తట్టుకొని (యాంటీ ఇన్ కంబెన్సీ) కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడం మాములు విష యం కాదు. సాధారణ ఎన్నికల తరువాత కీలకమైన రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో నూ బీజేపీ విజయం సాధించటం ఆ పార్టీ రాజకీయ వ్యూహాలు ఎంత బలంగా ఉన్నా యో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఇటీవల ఒక జాతీయ సర్వే సంస్థ కూడా పేర్కొంది.

ఫలించిన పొత్తు వ్యూహం

వరుసగా 16, 17వ లోక్  సభ ఎన్నిక ల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ 18వ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం స్వయంగా ప్రభుత్వ ఏర్పా టుకి కావాల్సిన మెజార్టీని సాధించడంలో విఫలమైంది. ఆ పార్టీ కేవలం 242 స్థానాలకు మాత్రమే పరిమితమై ప్రభుత్వ ఏర్పా టుకి మిత్రులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. 33 లోక్ సభ స్థానాల బలం కలిగిన తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ లోక్ జనశక్తి (పాశ్వాన్) లాంటి మిత్రపక్ష పార్టీల బలంతో బీజేపీ కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి లోక్ సభ ఎన్నికలకి  ముందు ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించిందో ఒకసారి పరిశీలిద్దాం. 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ సెక్యులర్ రెండు పరాజిత పార్టీలే. అయితే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని 18 ఎంపీ సీట్లు గెలిచి విజేతలుగా నిలిచా రు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తో మరొక పర్యాయం పొత్తుని పునరుద్ధరించుకొని తాను మూడు లోక్‌సభ స్థానా ల్లో గెలవటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి 21 ఎంపీల మద్దతును కూడగట్టుకోవడంలో సఫలమైంది. బీహార్‌లో  నితీశ్ కుమార్‌తో పాటు చిరాగ్ పాశ్వాన్ పార్టీ అయిన ఎల్జేపీతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడి 30 లోక్‌సభ స్థానాలలో విజ యం సాధించడం విశేషం.

అలా 18వ లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ ఏపీలో తెలుగుదేశం పార్టీతో, కర్ణాటకలో జేడీఎస్‌తో, బీహార్ లో లోక్ జనశక్తి (పాశ్వాన్)తో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే ఆ పార్టీకి కనీసం 200 లోక్ సభ స్థానాల్లో కూడా విజయం సాధించేది కాదు. అధికారంలోకి కూడా వచ్చేది కాదు. లోక్‌సభ ఎన్నికలకు ముం దు బీజేపీ.. గెలుపు కోసం తన రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా ఈ మూడు పార్టీలతో పొత్తును పునరుద్ధరించుకొని ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీ యగలిగింది.

కీలక విజయాలు

18వ లోక్ సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించలేకపోయినా బీజేపీ ఎక్కడా డీలా పడలేదు. ‘చార్ సో పార్’ లక్ష్యంగా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ, మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ  మిత్రపక్షాల అండతో ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసింది. లోక్ సభ ఎన్నికల అనంతరం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మరోసారి రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలతో మూడు కీలక రాష్ట్రాలలో గెలిచి తన పట్టు ని నిలుపుకుందని చెప్పొచ్చు.

జమ్మూ కశ్మీ ర్, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో పరాజయాలు ఎదురైనా వ్యూహాత్మకను ప్రద ర్శించిన బీజేపీ హర్యానా శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని లాగేసుకుంది. అలాగే లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ర్టలో ఓటమి ఎదురైనప్పటికీ  శాసనసభ ఎన్నికల నాటి  వ్యూహాత్మక వ్యూహాలను అనుసరించిన బీజేపీ అద్భుత విజయాన్ని దక్కించుకుం ది. 1998 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో గెలుపు ముఖం చాటేసిన బీజేపీకి ఈసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు పట్టం కట్టి అధికారంలోకి తీసుకొచ్చారు.

దీన్ని బట్టి ఆ పార్టీ రాజకీయ వ్యూ హాలు ఎంత బలంగా ఉంటాయో స్పష్టమవుతుంది. హర్యానా, మహారాష్ర్ట, ఢిల్లీ రాష్ట్రాల్లో గెలుపులో బీజేపీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ కూడా కీలకపాత్ర పోషించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నవంబర్‌లో జరిగే బీహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుతానికి మహా ఘట్ బంధన్‌కి కొంత అనుకూలత ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది.

అయితే బీజేపీ తమ వ్యూహకర్తలను బరిలోకి దిం పి ప్రత్యర్థి ఎత్తుగడలను చిత్తు చేసి విజయావకాశాల్ని తారుమారు చేయగలిగే అవకాశ ముందని పేర్కొంటున్నాయి. బీహార్‌లో కూడా ఎన్డీయే కూటమి విజ యం సాధిస్తే బీజేపీ బలం మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

అధ్యక్ష ఎంపిక సైతం

బీజేపీ తన తదుపరి అధ్యక్షుడి ఎన్నిక దక్షిణాది నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి ఎంపిక చేస్తారనే ఊహగానాలు ముందే వెలువడ్డాయి. కానీ ఉపరాష్ర్టపతి ఎన్నిక ఒక విధంగా బీజేపీకి అందివచ్చిన అవకాశం. కాబట్టి ఉపరాష్ర్టపతి పదవికి తమిళనాడు నుంచి సీపీ రాధాకృష్ణన్‌ని ఎంపిక చేసి తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది బీజేపీ ఎత్తుగడ.

దక్షిణాదిలోని తమిళనాడు నుంచి ఉపరాష్ర్టపతిని ఎంపిక చేసిన దరిమిలా.. బీజేపీ అధ్యక్షుడిగా మధ్యభారతం నుంచి ఓబిసి వర్గాలకు చెందిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల త రచూ ఓబీసీల గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ వ్యూహాలకు అడ్డుకట్ట వే యడానికే బీజేపీ తమ జాతీయ అధ్యక్షుడి గా ఓబీసీ వర్గాల నుంచి ఎంపిక చేసినట్టు అంతా భావిస్తున్నారు.

2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా బీజేపీ విజయపథంలో నడిపించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మరోసారి ము ఖ్యమంత్రిగా అవకాశం కల్పించకుండా అదే సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అ ప్పజెప్పడం వెనుక కూడా బీజేపీ రాజకీ య వ్యూహం లో ఒక భాగమే. బలమైన యాదవ సా మాజిక వర్గాన్ని తమ వైపు తి ప్పుకోవడం వల్ల విపక్షాల్లో ఉన్న యాదవ సామాజిక వర్గ నేతలకు బలమైన పోటీదారున్ని తయారు చేయడమే దీని లక్ష్యం.

2 024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కంచుకోటైన విదిశా లోక్ సభ స్థానంలో 8 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహన్ బాధ్యతలు చేపట్టారు. పార్టీ విధేయుడిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం, బలహీన వర్గాల నేత అయిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేయటం కూడా బీజేపీ ఎత్తు గడే అని చెప్పొచ్చు.

ప్రతి ఎన్నికను ఒక ఛా లెంజ్‌గా తీసుకుంటూ ప్రత్యర్థుల ఊహాల కి కూడా అందని వ్యూహాలతో ఒక దశా బ్ద కాలంగా బీజేపీ తన విజయయాత్రను అ ప్రతిహాతంగా కొనసాగిస్తుంది. ఇదే వై ఖరిని కొనసాగిస్తే ఆ పార్టీ మరింత బ లంగా తయారవ్వనుంది. ఇక బీజేపీ సాధిస్తున్న విజయాల్లో ఆ పార్టీ వ్యూహాలే ప్ర ధాన పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి.

 వ్యాసకర్త సెల్: 9885465877