calender_icon.png 10 September, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షరమే ప్రపంచానికి వెలుగు

07-09-2025 12:06:52 AM

డాక్టర్ షేక్ జాన్‌పాషా :

సెప్టెంబర్ 8.. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం :

* నేటి బాలలే రేపటి పౌరులు. జనాభాలో 27 శాతానికి పైగా ఉన్న 14 ఏళ్లలో పు బాలబాలికలకు విద్యాబుద్దులు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమలు చేపడుతుంది. అందులో భాగంగా విద్యాహక్కు చట్టం, సమగ్ర శిక్ష అభియాన్, బేటీ బచావో- బేటి పడావో, ఖేలో ఇండియా విద్యా కేంద్రాలు, నవోదయ పాఠశాలలు తదితర కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ అక్షరాస్యత రేటు 38 శాతం కుటుంబాలకే పరిమి తమైంది. అయితే కేరళ రాష్ర్టం సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించడంలో విజయవంతమైంది.

‘రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు.. ప్రతి అద్బుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది మాత్రం అక్షరమే’. ప్రతి ఏడాది సెప్టెంబర్ 8వ తేదీని అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ‘బహుభాషా విద్యను ప్రోత్సహించడం: పరస్పర అవగాహన మరియు శాంతి కో సం అక్షరాస్యత’ అనేది ఈ ఏడాది ఇతివృత్తం. 1966 నవంబర్ 17వ తేదీన యు నెస్కో సభ్య దేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ నిర్వహణ అనంతరం 1967 నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు.

మానవ హక్కుల గురించి ప్రపంచానికి గుర్తు చేయడం, అక్షరాస్యతను పెంచడం,- స్థిరమైన సమాజం వైపు నడిపించేలా ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలని యూనెస్కో నిర్ణయించింది. అందరికీ నా ణ్యమైన, సమానమైన, సమ్మిళిత విద్యను అందించడానికి అక్షరాస్యత ప్రాథమిక ప్రాముఖ్యతను పునరాలోచించడానికి యునెస్కో.. 1990 సంవత్సరాన్ని ‘అక్షరాస్యత సంవత్సరం’గా, 2003--2012 దశా బ్దాన్ని ‘అక్షరాస్యత దశాబ్దంగా’ ప్రకటించింది.

ఏడు సంవత్సరాల వయసు పైబడి న వారు ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. ప్రపంచంలో వంద శాతం అక్షరాస్యత సాధించిన ఫిన్లాండ్, గ్రీన్‌ల్యాం డ్, లగ్జంబర్గ్, నార్వే, ఉక్రెయిన్ అభివృద్ధి చెందిన దేశాలుగా పేరు పొందాయి.

ఇక మన భారతదేశ అక్షరాస్యత రేటు 2011 జనాభా లెక్కల ప్రకారం 74 శాతం. అయితే ప్రాథమిక స్థాయిలోనే ప్రతీ వంద మంది విద్యార్థుల్లో 29 మంది మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. వీరిలో ఎక్కువమం ది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే. ముఖ్యంగా మన దేశంలో మహిళా అక్షరాస్యత రేటు  తీసికట్టుగా ఉంది. 

డిజిటల్ అక్షరాస్యత వైపు

నేటి బాలలే రేపటి పౌరులు. జనాభాలో 27 శాతానికి పైగా ఉన్న 14 ఏళ్లలో పు బాలబాలికలకు విద్యాబుద్దులు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమలు చేపడుతుంది. అందులో భాగంగా విద్యాహక్కు చట్టం, సమగ్ర శిక్ష అభియాన్, బేటీ బచావో- బేటి పడావో, ఖేలో ఇండియా విద్యా కేంద్రాలు, నవోదయ పాఠశాలలు తదితర కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ అక్షరాస్యత రేటు 38 శాతం కుటుంబాలకే పరిమి తమైంది.

అయితే కేరళ రాష్ర్టం సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించడంలో విజయవంతమైంది. కేరళలో 14 సంవత్స రాలు పైబడిన వారిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా పెట్టు కుని సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో 21.88 లక్షల మందిని డిజిటల్ నిరక్షరాస్యులుగా గుర్తించారు. వారిలో 21.87 లక్ష ల మందికి డిజిటల్ శిక్షణ ఇవ్వగా.. 99.98 శాతం మంది ఉత్తీర్ణులవ్వడం విశేషం.

దేశంలో నిరక్షరాస్యులు 26 శాతం మంది ఉండగా.. పురుషుల కంటే మహిళల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నది. వీరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం 1988లో ‘జాతీయ అక్షరాస్యత మిషన్’ ను.. 2009లో మహిళా నిరక్షరాస్యతను తగ్గించడానికి ‘సాక్షర భారత్’ కార్యక్రమంతో పాటు, 2022 నుంచి అన్ని రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే సంకల్పం తో కేంద్రం 2027 లక్ష్యంగా ‘ఉల్లాస్’ అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తుంది.

అభివృద్దికై అక్షరాస్యత

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ర్ట మొత్తం జనాభా 3.50 కోట్లు. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 66.54 శాతం. వీరిలో పురుషులు 75.04 శాతం, మహిళలు 57.99 శాతం అక్షరాస్యతులుగా ఉ న్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభు త్వం రాష్ట్రంలో నిరక్షరాస్యులను.. అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం ఇటీవల టాస్, అడల్ట్ ఎడ్యుకేషన్, మెప్మా విభాగాల సహకారంతో ఎస్సీఈఆర్టీ ద్వారా మంచిర్యాల జిల్లాలోని చందారం గ్రామా న్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిం ది.

అక్షరాస్యతను పెంచడం కోసం రాష్ట్ర ప్రభు త్వం 15 సంవత్సరాల వయస్సు పైబడిన నిరక్షరాస్యులైన వయోజనుల కోసం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ద్వారా ‘ఉల్లా స్’ అనే ప్రాయోజిత కార్యక్రమాన్ని రాష్ర్ట విద్యాశాఖ పర్యవేక్షణలో అంగన్వాడీ, మహిళా స్వయం సహాయక బృందాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకుల సహకారంతో చేపట్టింది. ఇక పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ - 2024కు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 50 అత్యుత్తమ జిల్లాల్లో రాష్ట్రంలోని జనగామ జిల్లా ఎంపికవడం హర్షించదగ్గ విషయం.

నేషనల్ అచీవ్మెంట్ సర్వే (నాస్)- 2025 లో మన తెలంగాణ 26 వ స్థానంలో నిలిచింది. ఇక భారతదేశ సామాజిక, ఆర్థిక పు రోగతికి అక్షరాస్యత కీలకంగా మారింది. ఏ దేశమైనా స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే కనీసం 80 శాతంఅక్షరాస్యత కలిగి ఉండాలి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అక్షరాస్యత సాధనలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. నిరక్షరాస్యత నిర్మూలన కార్య క్రమాలు పకడ్భందీగా అమలు చేసి ఫలితాలు రాబట్టాలి. నిర్భంధ విద్యాహక్కు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి.

అం దరికీ విద్య చేరువ కావాలంటే ప్రభుత్వ పాఠశాలలను పట్టిష్టం చేయాలి. బాలికా విద్యను ప్రోత్సహించాలి. సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి. విద్యారంగంలో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటి పరిష్కారానికి మనం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరముందని అక్షరాస్యత దినోత్సవం గుర్తుచేస్తుంది. ఇకనైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విద్యాభివృద్ధికై జీడీపీ, జీఎస్డీపీల లో ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించేలా నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం.

 వ్యాసకర్త సెల్: 7386847203