21-11-2025 12:00:00 AM
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనడం, అమ్మడం రెండూ నేరమే. కానీ తెలంగాణలో అన్ని జిల్లాల్లో మెడికల్ షాప్స్ ఈ నిబంధనను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నాయి. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క మందులషాపులో ఫార్మాసిస్ట్ అందుబాటులో ఉండడం లేదు. అధికారుల నుంచి ఎలాంటి పర్యవేక్షణలు జరగడం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ షాపులో అర్హత పొందిన ఫార్మాసిస్ట్ తప్పనిసరిగా ఉండాలి. యాంటీ బయాటిక్ మందుల అమ్మకాలకు సంబంధించిన హెచ్1 రిజిస్టర్‌ను చాలా దుకాణాలు నిర్వహించడం లేదు.
జగదీశ్వర్, కరీంనగర్