calender_icon.png 27 August, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

27-08-2025 12:10:38 AM

ఆదిలాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): పెన్ గంగా నది నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో స్రవంతి స్పష్టం చేశారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల నేపథ్యంలో ఇసుక రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిం చా రు.

ఇందులో భాగంగానే ఆర్డిఓ స్రవంతి మంగళవారం జైనథ్, బోరజ్ మండలాల్లోని పలు పెన్ గంగా నది పరివాహక గ్రామాలలైన కౌఠ, సాంగ్వి, పెండల్వాడా, తర్నం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తర్నం వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను పట్టుకొని నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బోరజ్ తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.