calender_icon.png 30 December, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు

30-12-2025 01:42:08 AM

మేడ్చల్, డిసెంబర్ 29(విజయ క్రాంతి): జిల్లాకు అవసరమైన యూరియా ఎరువులు  ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్  మను చౌదరి  తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఈ రోజు వరకు 773 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి సేల్ కౌంటర్ వద్ద షామియానా, త్రాగు నీటి సౌకర్యం కల్పించాలని  సంబంధిత అధికారులకు సూచించారు.

ఉదయం 6.00 గంటల నుండి కౌంటర్ వద్ద యూరియా సేల్స్ ప్రారంభించాలని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న యూరియా నిల్వలు సాగుకు  సరిపోతాయని, అవసరాన్ని బట్టి మరిన్ని సరఫరాలు కూడా క్రమం తప్పకుండా అందుతున్నాయని కలెక్టర్ రైతులకు భరోసానిచ్చారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.