24-09-2025 12:00:00 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కెరమేరి మండలంలోని ఇందా పూర్‌లో పత్తి పంట మధ్యలో గంజాయి మొ క్కలు సాగు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కెరమేరి పోలీస్ స్టేషన్ ఎస్సై మధుకర్ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వ హించగా వడై పోశెట్టి అనే రైతు పత్తి చేనులో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు బయటపడింది. ఎస్సై కథనం ప్రకారం... వడై పోశెట్టి పత్తి చేనులో మొత్తం 130 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గంజాయి సాగు చట్టపరంగా నేరంమని గంజాయి సాగు చేసే వారు లేదా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్య లు తీసుకుంటమన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గంజాయి సాగు గమనించిన వారు తక్షణమే పోలీసులకు సమాచా ం అందించాలని సూచించారు.