22-11-2025 02:04:06 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి) : 2047 నాటికి తెలంగాణ ఒక గ్లోబల్ గ్రోత్ ఇంజన్‌గా ఎదగాలి.. ఆ ఇంజన్‌ను ముందుకు నడిపే శక్తి జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీకి ఉందని ఉప, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం జేఎన్టీ యూ డైమండ్ జూబ్లీ వేడుకల ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈసందర్భంగా సావనీర్‌ను ఆవిష్కరించి, పూర్వ విద్యార్థులను సన్మానించారు.
అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, గత అరవై ఏళ్లలో లక్షలాది మంది ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పాలకులను తీర్చిదిద్దిన ఈ పవిత్ర స్థలంలో నిలబడటం ఆనందంగా ఉందన్నారు. భారత భవిష్యత్తు విజ్ఞానంపై, యువత ధైర్యంపై నిర్మితమవుతుం దని తొలి ప్రధాని నెహ్రూ విశ్వసిం చారు. ఆయన కలను ఈ విశ్వవిద్యాలయం నిజం చేసింది, అని అన్నారు. సిలికాన్ వ్యాలీలో ఒక రాయి విసిరితే అది ఐఐటీయన్ లేదా జేఎన్టీయూ పూర్వ విద్యార్థి మీద పడుతుంది’ అనే నానుడి మన వర్సిటీ కీర్తికి నిదర్శనం.
ఇస్రో నుంచి గూగుల్ వరకు, డీఆర్‌డీఓ నుంచి టెస్లా వరకు, జేఎన్టీయూ భారతదేశాన్ని ముందుకు నడిపిం చిన తరాలను సృష్టించిందని కొనియాడారు. జేఎన్టీయూ ఎదుర్కొంటున్న సమస్య లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. విద్య అనేది ఖర్చు కాదు, భవిష్యత్తుపై పెట్టుబడి, అని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుత విద్యార్థులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లా డుతూ ఉద్యోగం కోరేవారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా, స్టార్టప్ వ్యవస్థాపకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా రంగ పునర్నిర్మాణం జరుగుతోందని భట్టి తెలిపారు. సమావేశంలో రాష్ర్ట ప్రభు త్వ సలహాదారు కే. కేశవరావు, జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, యూనివర్సిటీ రెక్టార్ విజయ్ కుమార్, రిజిస్ట్రార్ కే. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.