calender_icon.png 1 October, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

01-10-2025 12:55:10 AM

కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశం హాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.

జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పిటిసి, సర్పంచుల ఎన్నికలు రెండు విడుతలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను, పోలింగ్ అధికారులను, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు ఇప్పటికే నియమించినట్లు తెలిపారు. జిల్లాలో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కటౌట్లు తొలగిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ పగడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు.

పోస్టల్ రూ, హోర్డింగులు ఏర్పాటుకు అధికారుల నుంచి ముందు అనుమతులు తీసుకొ వా లాని కోరారు. ఎంపీటీసీ, జెడ్పిటిసి అభ్యర్థులు ఆర్డీవో అనుమతి పొందాలని, సర్పంచులు, వార్డు మెంబర్లు తాసిల్దారుల అనుమతి తీసుకోవాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలకు అభ్యర్థులు 5వేల జనాభా కు పైన ఉన్న గ్రామాలలో2.5 లక్షలు, 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో 1.5  లక్షలు లోపు ఖర్చు చేయాలని తెలిపారు.

సర్పంచులకు 50 వేలు, వార్డు సభ్యులకు 30 వేల లోపు ఖర్చు చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున వాహన దారుల వద్ద 50 వేల కంటే ఎక్కువ డబ్బులు ఉండవద్దని సూచించారు.   ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, విక్టర్, శిక్షణ సబ్ కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.