calender_icon.png 1 October, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరూరా మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

01-10-2025 12:53:32 AM

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 

భీంగల్ సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి):  ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టక ప్రవేట్ వ్యాపరులకు తక్కువ ధరకు మక్కలు అమ్ముకోవడం వలన తాము నష్టపోతున్నమని రైతులు ఎమ్మెల్యే తో తమ ఆవేదన వెలిబుచ్చారు. స్పందించిన ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటాలుకు 2400 మద్దతు ధర తో పాటు మీరు ఇచ్చిన హామీ ప్రకారం అదనంగా 400 రూపాయలు ఇచ్చి 2800 లకు కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు.

బడా భీంగల్ నుండి అక్లూర్ వెళ్లే దారిలో రోడ్ పై కి. మీ మేరా రాసులుగా పోసి ఉన్న మక్కలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. అక్కడే ఉన్న రైతులతో  మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే రైతుల దగ్గర మక్కలు క్వింటాలకు 2800 జరపకాలని కాని ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోయేసరికి దలారులకు 1600 లకు రైతులు కష్టానికి అమ్ము కుంటున్నారన్నారు.

ప్రతి రైతుకు క్వింటాలుకు సుమారు 1000 రూపాయల చొప్పున నష్టపోతున్నారనీ ఒకరైతు ఎకరాకు 30 క్వింటాలు మక్కలు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ప్రవేట్ వ్యాపారులకు అమ్మి ఎకరాకు రూ: 30,000 రూపాయలు నష్టపోతున్నార నీ అన్నారు. రైతులు పంటను సరైన ధరకు అమ్ముకోలేక నష్టపోతు బాధపడుతుంటే  ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అని ఆయన ప్రశ్నించారు.?

నేను ఇప్పటికే ప్రతి పిఎసిఎస్ ద్వారా ఊరురా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్ చేశాన నీ ఆయన రైతులకు తెలిపారు. అయినా ప్రభుత్వంలో అధికార యంత్రాంగంలో చలనం లేదు. వర్షాలు పడుతున్నాయి మక్కలు ఫంగస్ వచ్చినట్లయితే ధర రాక రైతులు ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు ఇచ్చిన మాట ప్రకారమే 2400 మద్దతు ధర ఉన్న మక్కలకు అదనంగా 400 కలిపి క్వింతాలూకు 2800 లకు కొనుగోలు చేయాలి.

వెంటనే ప్రతి ఊరురా కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయనట్లయితే రైతుల ఉసురు మీకు, ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుందనీ ఆయన శాపనార్థాలు పెట్టారు. మీ ప్రభుత్వం క్వింటలూకు 2800 చెల్లించి కొనుగోలు చేసేవరకు బి ఆర్ ఎస్ పార్టీ రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు.