01-07-2025 10:05:32 PM
పాపన్నపేట: పాపన్నపేట మండల పరిధిలోని పాత లింగాయిపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఏడుపాయల దేవస్థానం మాజీ ధర్మకర్త మాదగళ్ళ కిష్టయ్య మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి(BRS District President Padma Devender Reddy) అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కిష్టయ్య సోమవారం గుండెపోటుతో మరణించారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా మెదక్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి హాజరై కిష్టయ్య పార్తివదేహానికి నివాళులు అర్పించారు.
కిష్టయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి యాభై వేలు, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి యాభై వేలు, టీఆర్ఎస్ పార్టీ తాజా మాజీ సర్పంచులు లక్ష యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల మాది చైర్మన్ బాలాగౌడ్, నాయకులు సోములు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.