calender_icon.png 17 November, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

17-11-2025 01:30:32 AM

చిట్యాల, నవంబర్ 16 (విజయ క్రాంతి): హైదరాబాద్ లోని ఉన్న అయ్యప్ప సొసైటీ మాదాపూర్ సిజిఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 16 నవంబర్ ఆదివారం  రాష్ట్రస్థాయి త్రో  బాల్  పోటీలు నిర్వహించగా, పోటీలలో  చిట్యాల గ్రీన్ గ్రోవ్ పాఠశాల కు చెందిన ఆర్.భవ్య శ్రీ , స్టాండ్ బై లో పి. ప్రీతి జెస్సి,  నార్కట్ పల్లి ప్రభుత్వ కళాశాల విద్యార్థి షేక్  నాగూర్వల్లీ రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి త్రో బాల్ పోటీలకు ఎంపిక అయ్యారు.

ఈ పోటీలలో ఎంపికైన విద్యార్థులు డిసెంబర్ 5 నుండి 7 వరకు మహారాష్ట్ర లోని బదులాపూర్ లో  జరిగే జాతీయస్థాయి త్రో బాల్ పోటీల లో  పాల్గొననున్నారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ త్రో బాల్ జనరల్ సెక్రెటరీ టి కృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడల వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి ఎదగవచ్చని,క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయని అన్నారు. ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ త్రో బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ జి .రాము,  ప్రెసిడెంట్ వై చంద్రశేఖర్, భువనగిరి, యాదాద్రి జిల్లా త్రో బాల్ మోత్కూర్ యాదయ్య , తెలంగాణ త్రోబాల్  జనరల్ సెక్రెటరీ అరుణ్, తెలంగాణ ట్రెజరీ జమీల్‌ఎం పికైన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.