14-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, ఆగస్టు 13 (విజయ క్రాంతి): విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కామారెడ్డి శాసనసభ్యులు కాటేపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. బుధవారం రామారెడ్డి మండలం మద్దికుంట, రెడ్డిపేట పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు.
పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు వారానికి ఒకేసారి గుడ్డు పెడుతున్న విషయం తెలుసుకొని వెంటనే సంబంధిత పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ వాళ్లతో, పాఠశాల ప్రధానోపాధ్యాయినితో, ఎంఈఓతో ఫోన్లో మాట్లాడి విద్యార్థులకు పౌష్టికాహార లోపం ఏర్పడకుండా వారానికి మూడుసార్లు గుడ్లు పెట్టాలని అధికారులను ఆదేశించారు. బిల్లులను సాకుగా చూపి విద్యార్థులకు గుడ్డు పెట్టకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. ఇలాంటివి మళ్లీ పునరావృత్తమైతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.