calender_icon.png 19 September, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

19-09-2025 12:00:00 AM

ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల

నకిరేకల్, సెప్టెంబర్18 (విజయక్రాంతి): విధ్యార్ధులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని  భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం అన్నారు. గురువారం  నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన నకిరేకల్ నియోజకవర్గ స్థాయి బాలికల పాఠశాల క్రీడోత్సవాలను ప్రారంభించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. విద్యార్థుల్లో ఐక్యతను చాటి చెప్తాయన్నారు. క్రీడలు ఆడటం వల్ల శారీరిక మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజూలమాధవ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రంజిత్ కుమార్,

మండల స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, జ్ఞాన ప్రకాష్ రావు, తహశీల్దార్ యాదగిరి, ఎంఈఓ మేక నాగయ్య, వంటేపాక ఏసు పాదం పన్నాల, రాఘవరెడ్డి లింగాల వెంకన్న, స్థానిక కౌన్సిలర్లు, పీఈటీలు. చింతకాయల పుల్లయ్య, విద్యాసాగర్ రెడ్డి  పాల్గొన్నారు.