19-09-2025 12:00:00 AM
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముద్దా గోపాల్
ముషీరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్ తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ముషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ చందనతో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను పేదలు వినియోగించుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది రాహుల్, నిరంజన్ రెడ్డి, శివప్రసాద్, బిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, శంకర్ ముదిరాజ్, అడిక్మెట్ కార్యదర్శి సురేందర్, సీనియర్ బిఆర్‌ఎస్ నాయకులు ముఠా నరేష్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సమాచారం ఇవ్వకుండా ఎలా..?
స్థానిక కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వకుండా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీ ప్రశ్నించారు. గురువారం ముషీరాబాద్ తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ముషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ చందనను నిలదీశారు.
ఉద యం 10 గంటలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉందని సమాచారం ఉందని, అందు కు తాము వచ్చి వేచి చూసామని, అయినప్పటికీ ప్రారంభం కాకపోవడంతో దోమలగూడలో నిలిచిపోయిన వరద నీటిని పరిశీలించడానికి వచ్చిన అధికారులను కలవడానికి తిరిగి వెళ్ళామన్నారు. ఎమ్మెల్యే 12 గంటలకు వచ్చి చెక్కుల పంపిణీ చేసి వెళ్లిపోవడం సరైనది కాదన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా తమను చిన్నచూపు చూడడం తగదన్నారు.