మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే మురళి నాయక్
కేసముద్రం, జూన్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళల హార్దిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, వడ్డీ లేని రుణాలతో పాటు, మహిళల ఆర్థిక పరిపుష్టికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందని అందులో భాగంగానే ప్రతి గ్రామంలో మహిళా శక్తి భవనాలను నిర్మిస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు.
కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహమూద్ పట్నం గ్రామంలో మహిళా శక్తి కార్యాలయం ఏర్పాటుతో స్వయం సహాయక సంఘాల మహిళలు సమావేశాలు నిర్వహించుకోవచ్చని, శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి భవనానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్, బండారు వెంకన్న, ఎంపీడీవో క్రాంతి, ఎంపీఓ హరీష్, ఎస్ ఐ క్రాంతి కిరణ్, మహమూద్ పట్నం గ్రామ సర్పంచ్ కట్ల ఎల్లయ్య, ఉపసర్పంచ్ ఏశబోయిన అమృత శ్రీనివాస్, వార్డు మెంబర్లు పెనుమాండ్ల సోమయ్య, దాసరి లచ్చమ్మ, వివోలు చింతమళ్ళ సంధ్య, భూక్య నెహ్రూ, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిట్టగడుపుల యాకూబ్, బద్దుల వెంకటమల్లు, చిలువేరు లింగయ్య, బద్దుల తిరుపతి, మాజీ ఎంపీటీసీ ముంజాల శ్రీనివాస్, మాజీ వార్డ్ మెంబర్లు ఎలిజాల యాకయ్య ,కాసోజు యాకాంత చారి తదితరులు పాల్గొన్నారు.






