06-12-2024 12:31:56 AM
*విద్యాశాఖ కమిషన్ చైర్మన్ మురళి
భైంసా, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఉన్నత లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సూచించారు. నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం బాసర ఆర్జీయూకేటీని ఆయన సందర్శించి ఇంచార్జి వీసీ గోవర్ధన్, విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా విద్యాబోధన, క్యాంపస్, పరీక్షల నిర్వహణ, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. పోటీ ప్రపంచంలో ఒత్తిడి సహజమని, దానిని అధిగమిస్తేనే విజయం సాధ్యమవుతుందన్నారు.
శాస్త్రసాంకేతిక విద్యాబోధన లో మార్పులకు అనుగుణంగా అధ్యాపకులు నాణ్యమైన విద్యను అందించి విద్యా ర్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం మెస్‌ను తనిఖీ చేసి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, వంటశాలలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనం తరం మండలంలోని బిద్రెల్లి ప్రభుత్వ పాఠశాల, నర్సాపూర్ జీ మండలకేంద్రంలోని కేజీబీవీలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.