28-01-2025 01:14:19 AM
ముల్తాన్: పాకిస్థాన్ గడ్డపై వెస్టిండీస్ 35 ఏళ్ల తర్వాత గెలుపొందింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1 డ్రాగా ముగించింది. ముల్తాన్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో విండీస్ 120 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 163 పరుగులు చేయగా.. పాక్ 154 పరుగులకు ఆలౌటైంది.
రెండో ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్ కాగా.. 253 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆతిథ్య పాక్ 133 పరుగులకే కుప్పకూలి 120 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 1990లో పైసలాబాద్ టెస్టులో గెలిచిన విండీస్ ఆ తర్వాత 1997, 2006లో పాక్ పర్యటనకు వెళ్లినప్పటికీ ఒక్క విజయం సాధించలేకపోయింది.