calender_icon.png 28 August, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నీ.. తులసి ఎంట్రీ ఇస్తే అంతే!

26-08-2025 12:37:42 AM

బాలీవుడ్‌లో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి’. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకుడు. ఈయన గతంలో ‘హంప్టీ శర్మ కీ దుల్హానియా’, ‘బద్రీనాథ్ కీ దుల్హానియా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో రోహిత్ సరాఫ్, సన్యా మల్హోత్రా, మనీష్ పాల్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ను మేకర్స్ సోమవారం సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నా రు.

ఈ మేరకు విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మోషన్ పోస్టర్ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న నిర్మాత కరణ్ జోహార్.. ‘మండపాన్ని అలంకరిస్తారు.. పార్టీ జరుగుతుంది.. కానీ సన్నీ, తులసి ఎంట్రీ మొత్తం స్క్రిప్ట్‌ను మారుస్తుంది’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను ఇదే నెల 28న విడుదల చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.