calender_icon.png 30 January, 2026 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్‌పై పొంగులేటి, కలెక్టర్ దివాకర టీఎస్

30-01-2026 01:19:33 AM

జాతర ఏర్పాట్లు భక్తుల సౌకర్యాలు పర్యవేక్షణ

మేడారం, జనవరి 29 (విజయక్రాంతి): మేడారం జాతర ఏర్పాట్లను గురువారం ఉదయం బైక్ లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ దివాకరతో కలిసి పరిశీలించారు. మొదటగా జంపన్న వాగు పరిసర ప్రాంతాల చేరుకొని స్నాన ఘట్టాలు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం కన్నెపల్లి సర్కిల్ వద్ద ట్రాఫిక్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. జంపన్న వాగు వద్ద భక్తులతో మాట్లాడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా  ఎప్పటికప్పుడు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్య అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.