calender_icon.png 2 May, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ ప్రాజెక్ట్ లకు టీఏసీ గ్రీన్ సిగ్నల్

25-04-2025 01:51:09 AM

 పరుగులు పెట్టనున్న సీతారామ ప్రాజెక్ట్ 

సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కు మంత్రి తుమ్మల ధన్యవాదాలు

ఖమ్మం, ఏప్రిల్ 24( విజయక్రాంతి ):-సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ , సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ సమీకృత డి.పి.ఆర్ కుసెంట్రల్ వాటర్ కమిషన్  (సాంకేతిక సలహా కమిటీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గురువారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు పనులకు అడ్డంకులు తొలగిపోయాయని, జిల్లా ప్రజల కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని తలంపుతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా మహబూబాద్ జిల్లా ప్రజల పక్షాన రైతాంగం పక్షాన మంత్రి తుమ్మల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. టి ఏ సి సీతారామ ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపడంతో లక్షలాది ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయని, 2023 జనవరి 27న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మరియు  సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ డి.పి. ఆర్ ను అనుమతులు కొరకు సెంట్రల్ వాటర్ కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందన్నారు.దీంతో పలుమార్లు సమావేశాలు తర్వాత ప్రాజెక్టుకు అనుమతులు టిఎసి నిర్ణయం తీసుకుందని తెలిపారు.సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 11 నియోజకవర్గాలు 31 మండలాల్లో 4,15,620 ఎకరాల కొత్త ఆయకట్టు మరియు 3,72,068 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు  సాగులోకి రానుంది.