calender_icon.png 19 September, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొటోకాల్ పాటించని కలెక్టర్‌పై చర్యలు తీసుకోండి

19-09-2025 12:00:00 AM

  1. బీసీ దళిత సంఘాల డిమాండ్ 
  2. జాతీయ గీతాలాపన సమయంలో సైరన్‌తో వచ్చిన కలెక్టర్
  3. ఆది శ్రీనివాస్‌ను అగౌరవ పరిచారని ఎస్పీకి ఫిర్యాదు 

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవమానపరిచి. అగౌరపరచినందున అతనిపై చ ట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాలు, దళిత సం ఘాలు గురువారం రోజున డిమాండ్ చేశా యి.

కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తున్న క్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోటోకాల్ పాటించకుండా మధ్యలోనే వచ్చి తన కారు సైరన్ సౌండ్ మోగించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివా స్‌ను ప్రజాపాలన దినోత్సవాన్ని అగౌరపరిచి అవమానించారన్నారు.

ఉద్దేశపూర్వకంగా ఒక బీసీ బిడ్డ ఆయన ఆది శ్రీని వాసు ను ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆది శ్రీనివాస్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశా రు. చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఎస్పీ ఫి ర్యా దు చేసిన అనంతరం పై అధికారులతో మా ట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆది శ్రీనివాస్ పై జరిగిన అవ మానం యావత్తు బీసీ, దళితులకు జరిగిన అవమానంగా భావిస్తున్నామన్నారు.

చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భం గా నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పర్ష హన్మాండ్లు, గడ్డం నరసయ్య, కత్తెర దేవదాసు, బొప్ప దేవయ్య, చొక్కాల రాము, గోలి వెంకటరమణ, రాగుల రాము లు, రాగుల జగన్, బట్టు ప్రవీణ్, తడక కమలాకర్, కంచర్ల రాజు, రవీందర్, మల్లేశం, ఇల్లంతకుంట తిరుపతి, నల్ల శ్రీకాంత్, సామల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ కు షోకాజ్ నోటీసు

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనకు జరిగిన. అవమానాన్ని ప్రభుత్వ పెద్దలకు సీఎస్ కు స్వయంగా బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు సీఎస్ గురువారం షోకాజ్ నోటీసు ఇచ్చి ఆదేశాలు జారీ చేశారు.