calender_icon.png 19 September, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంపెనీ వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 35%వాటా చెల్లించాలి

19-09-2025 12:00:00 AM

ఇల్లందు, సెప్టెంబర్18, (విజయక్రాంతి):కార్మికులకు వాస్తవ లాభాల్లో 35% వాటా చెల్లించాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహమ్మద్ డిమాండ్ చేశారు.ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునీయన్ ఆద్వర్యంలో గురువారం స్థానిక సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ముట్టడించారు. సమస్యలతొ కూడిన వినతిపత్రం జీఎం వీసం కృష్ణయ్య కి నాయకులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలొ గత సంవత్సర కాలంగా రెండు సార్లు డైరెక్టర్ (పా )తో ఒకసారి సి అండ్ ఎండీ తో సమావేశం నిర్వహించి, అంగీకరించిన అంశాలను సర్కులర్ ఇవ్వకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు., స్వంత ఇంటి పథకంపై కమిటీ వేసిన ఇంతవరకు ఒక సమావేశం జరుగ లేదన్నారు. దీనిపై 2009వ సంవత్సరాoలో స్వంత యింటి పథకంపై సర్కులర్ ఇచ్చిన అనాడు కార్మికులు ఇష్ట పడలేదు.

దాన్నే అమలు చేయండి అంటే కాలయాపన చేయడం వలన కార్మికవర్గం పోతుందన్నారు. మెడికల్ బోర్డు విషయంలో 10సంవత్సరాల నుండి కొనసాగిన నాడు లేని ఏసీబీ బూచి చూపి బోర్డు ఆపడం యాజమాన్యం చేస్తున్న తప్పిదామన్నారు., గతంలో లాగా మెడికల్ బోర్డు పెట్టాలని కోరారు.వాస్తవ లాబాలు ప్రకటించి అందులో 35%వాటా ప్రకటించాలి. ఎన్నడూ లేనివిదంగా ట్రాన్స్ఫర్ పాలసీ తెచ్చి కార్మిలను ఇబ్బంది పెట్టె కార్యక్రమాన్ని మార్చమంటే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో బ్రాంచి ఉపాద్యక్షులు దాసరి రాజారామ్, బ్రాంచ్ సహయ కార్యదర్శి గడదాసు నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొరిమి సుందర్, ఫిట్ కార్యదర్శులు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, దాట్ల వేంకటేశ్వర్లు, బానోత్ బాలాజీ, జయరాజ్, గుగులొత్ కృష్ణ, బొల్లెద్దుల శ్రీనివాస్, నూనె శ్రీనివాస్, నజీరుద్దిన్, యాకుబ్, దాట్ల శ్రీకాంత్, షేక్ సర్వర్, శ్యామ్ సుందర్, తిరుమలరావు, చిక్కా శ్రీనివాస్, వెంగళ రవి, గుగ్గల్ల శ్రీనివాస్, ప్రసాద్ రెడ్డి, శ్వేతా, పద్మ తదితరులు పాల్గొన్నారు.