calender_icon.png 19 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదప్రజల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి

19-09-2025 12:00:00 AM

  1. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

కూసుమంచి, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): పేద ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అ న్నారు. మంత్రి, గురువారం కూసుమంచి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి ప నులకు శంకుస్థాపన చేశారు.కూసుమంచి గ్రామంలో 35 లక్షలతో నిర్మించనున్న.

అంతర్గత సిసి రోడ్ల నిర్మాణాలకు, చేగొమ్మ గ్రామంలో 49 లక్షల 50 వేలతో నిర్మించనున్న అంతర్గత సీసీ నిర్మాణాలకు, కేశవా పురం గ్రామపంచాయతీ చింతల తండా గ్రా మంలో 20 లక్షల 50 వేలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మం త్రివర్యులు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ చేగొమ్మ గ్రామంలో 20 లక్ష ల రూపాయలతో ఆరోగ్య కేంద్రం, 20 ల క్షల రూపాయలతో పంచాయతీ భవనం, మంచి నీటి పథకానికి 4.5 లక్షలు ఖర్చు చేసి పూర్తి చేయడం జరిగిందని అన్నారు.

ప్రజలు అందిస్తున్న సహకారంతో ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల తీసుకుని వచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. పేద ప్రజల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫ రా, ఉగాది నుంచి నిరుపేదలకు రేషన్ ద్వా రా సన్న బియ్యం పంపిణీ, 11 లక్షల నూ తన రేషన్ కార్డులను పంపిణీ చేశామని తెలిపా రు. రైతు భరోసా కింద పెట్టుబడి సహా యం ఎకరానికి 12 వేల రూపాయలకు పెంచ డం జరిగిందని, 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ పూర్తి చేసామని అన్నారు.

గత పాలకులు డ బుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరు తో పేదలను మోసం చేస్తే మన ప్రజా ప్రభు త్వం చిత్తశుద్ధితో మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేశామని, మిగిలిన అర్హులకు కూడా తదుపరి విడుతలలో తప్పనిసరిగా ఇండ్లు మంజూరు చేస్తామని, రా బోయే అ సెంబ్లీ ఎన్నికల కంటే ముందు మరో 3 సా ర్లు ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేస్తామని అన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిధులు బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని అన్నారు.

అర్హులైన నిరు పే దలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చే సే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని అన్నారు. అంతకుముందు మంత్రివర్యులు కూసుమం చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 18 క ళ్యాణలక్ష్మి, ఇద్దరు షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్ర మంలో ఆర్ అండ్ ఎస్‌ఇ యాకోబు, పీఆర్ ఎస్‌ఇ వెంకట్ రెడ్డి, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, కూసుమంచి మండల తహ సీల్దార్ రవికుమార్, వివిధ శాఖల అధికారు లు, తదితరులు పాల్గొన్నారు.