calender_icon.png 24 October, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు అమరవీరుల సేవలు వెలకట్టలేనివి

23-10-2025 07:30:10 PM

అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ..

పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు..

అచ్చంపేట: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలు వెలకట్టలేనివని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రశంసించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం అచ్చంపేటలోని పోలీస్ స్టేషన్లో మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని డీఎస్పీ పల్లె శ్రీనివాసులు ప్రారంభించారు. నియోజకవర్గంలో మీ దగ్గర గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. ఎమ్మెల్యే సైతం రక్తదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు సేవలను వారి అంకితభావాన్ని కొనియాడారు. శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అచ్చంపేట సిఐ నాగరాజు, ఎస్సై విజయభాస్కర్, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.