03-12-2025 12:00:00 AM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 4,5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. భారత్‌లో జరగనున్న వార్షిక శిఖరాగ్ర స మావేశానికి పుతిన్ అధ్యక్ష హోదాలో హాజరవనున్నారు. కాగా 2021 త ర్వాత పుతిన్ భారత్‌కు రానుండడం ఇదే మొదటిసారి. పుతిన్ పర్యటన సందర్భంగా భారత్ ఎస్ అదనపు క్షిపణులు కోరడంతో పాటు సుఖో య్‌ణూ57 యుద్ధ విమానాల కోసం ఒప్పందాలు చేసుకునే అవకాశముంది.
అణుశక్తి, సాంకేతికత, వ్యాపార రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపేతం చేసుకోవడానికి పుతిన్ పర్యటన మనకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. ప్రస్తుతం రష్యా దగ్గరున్న అత్యంత ఆధునాతన ఆయుధ టెక్నాలజీ భారత్‌కు చాలా అవసరం. మన పక్కనే ఉన్న చైనా తన ఆయుధ సంపత్తిని రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. మరోవైపు పొరుగు దేశం పాకిస్థాన్ కుట్రలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దీనికి తోడు బంగ్లాదేశ్ కూడా ఈ మధ్యన భారత్‌కు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా రక్షణ సాంకేతికతో తయారైన ఆయుధాలను కొనుగోలు చేయడం భారత్‌కు అత్యవసరం. అంతేకాదు ఈ ఏడాది మేలో ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో రష్యా తయారుచేసిన ఎస్ క్షిపణులు ఎంత ప్రభావం చూపాయన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి రష్యా నుంచి ఎస్ అదనపు క్షిపణులు కొనుగోలు చేయడంతో పాటు భారత్‌లోనే ఇవి తయారు చేసుకునేందుకు రష్యా నుంచి పేటెంట్ హక్కులను పొందేందుకు కూడా ఇదే మంచి తరుణమని చెప్పొచ్చు.
రష్యాతో ఒప్పందం కుదిరితే ఎస్ లాంటి క్షిపణులను భారత్ మన దగ్గరే సగం ధరకు త యారు చేసుకోగలదు. అయితే భారత్, రష్యాల మధ్య ఉన్న బంధం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది. ప్రపంచంలో ఇప్పటికీ రష్యా నుంచి అధిక ఆయుధాలు కొనుగోలు చేస్తున్న జాబితాలో అగ్రస్థానం భారత్‌దే. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా అనేక ఆంక్షలు పెట్టింది.
చాలా దేశాలు రష్యాతో చమురు వాణిజ్యాన్ని తగ్గించేసినప్పటికీ భారత్ మాత్రం ఇప్పటికీ అధిక చమురును కొనుగోలు చేస్తూ రష్యాతో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ లాంటి దేశంతో సహకారం, వాణిజ్య బంధం ఈ సమయంలో రష్యాకు కీలకంగా మారింది. పుతిన్ రాక భారత్, రష్యా అనే రెండు శక్తివంతమైన మిత్రదేశాల మధ్య వ్యూహాత్మక భేటీగా ప్రపంచానికి బలమైన సందేశం మాత్రం కచ్చితంగా వెళ్లనుంది. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాను ఒంటరి చేయాలని అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఒత్తిళ్లను భారత్ ప్రతిఘటించింది. ఫలితంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై భారీ సుంకాలు, కఠిన ఆంక్షలు విధించారు.
ఇది భారత్, అమెరికా మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేసింది. భారత్‌తో శత్రుత్వం సరికాదని భావించిన ట్రంప్ త్వరలో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు ప్రకటించడం గమనార్హం. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు రానుండడంపై అమెరికా ఏ విధంగా స్పందిస్తుదనేది ఆసక్తిగా మారింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు తగ్గించాలని ట్రంప్ పదేపదే డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో.. రెండు దేశాలు ఎలా ముందకెళ్తాయన్నది కీలక అంశంగా మారిపోయింది.