21-11-2025 01:05:31 AM
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 20 (విజయ క్రాంతి): వేములవాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, రహదారు లు & భవనాలు, పంచాయితీ రాజ్, గృహనిర్మాణ, మిషన్ భగీరథ, తదితర శాఖల అధికారులతో వేములవాడ మున్సిపల్ కా ర్యాలయంలోని సమావేశ మందిరంలో రా ష్ట్ర ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ గురువారం సమీక్ష నిర్వహించారు.
ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి, సరఫరాలో ఇబ్బందులు దూరం చేసేందుకు వేములవాడ నియోజకవర్గానికి 220/11, 133/11 ఒక్కొకటి 33/11 (11) సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయని విప్ వెల్లడించారు. ఆయా సబ్ స్టేషన్ల పురోగతి పై ఆ రా తీశారు.పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద మం జూరైన పనుల నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు.
పది కోట్ల రూపాయలు ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేయడం జరిగిందని,మూలవాగు వంతెనకు 2015 లో శంకుస్థాపన చేసి, వంతెన నిర్మాణం కోసం 6 కోట్ల 90 లక్షల రూపాయలు భూసేకరణ కోసం కేటాయించడం జరిగిందని, అవసరమైన భూసేకరణ చేసి, పనులు ప్రారంభించి, పనులు వేగవంతం చేయాలని, వచ్చే వర్షాకాలంలో లోగా వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న కల్వర్టులు, రహదారుల మరమ్మతు పనులపై ఆరా తీశారు.దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, వంతెనలకు భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ నింపడంతో భూము లు మునిగి పోతున్నాయో 318 అడుగుల వరకు నీటిని నింపామ్. ప్రాజెక్ట్ కు హద్దులు నిర్ణయించి, అధికారికంగా పూర్తి చేయాలని విప్ పేర్కొన్నారు.
రైతులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. మరోసారి సర్వే చేసి స్పష్టం చేయాలని సూచించారు. హద్దులకు రాళ్లు, చెట్లు పెట్టాలని ఆదేశించారు.మధ్య మానేరు నిర్వాసితులకు పట్టాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని, ఆలయాలు, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.సమావేశంలో వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.