24-07-2025 12:00:00 AM
‘సర్ జేమ్స్ విల్సన్’ చొరవతో 24 జూలై 1860న తొలిసారి ఆ దాయ పన్ను విధానం అమలైంది. అది దేశ ఆర్థిక చరిత్రలో ఒక విప్లవాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. వ్యక్తులు, వ్యాపార సంస్థల ఆదాయాన్ని బట్టి ప్రతీ ఆర్థిక సంవత్సరం నిర్ణీత పన్నులను వసూ లు చేయడాన్ని ‘ఆదాయ పన్ను’ అని అంటున్నాం.
తర్వాత ఆదాయపన్ను వసూళ్ల విధానంలో విప్లవాత్మక మార్పులు రావడానికి 1860 ఆదాయ పన్ను విధానం పునాదిగా ‘ఇన్‌కమ్ టాక్స్ చట్టం, 1922 అమల్లోకి వచ్చింది. 1922 నాటి చట్టం ద్వారా ఒక పటిష్ట పరిపాలనా పద్ధతి ప్రకారం ఆధునిక రీతుల్లో భారతీయుల నుంచి ఆదాయ పన్నులను వసూలు చేయడం కొనసాగుతోంది. భారత ప్రభుత్వం 1924లో తీసుకువచ్చిన ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చట్టం’తో చట్టబద్ధమైన ఆదాయపన్ను అధికారుల (ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్స్) సమూహం ఆదాయ పన్ను శాఖలో భాగమయ్యారు.
1946లో గ్రూప్ - ఎ స్థాయి అధికారులను నియమించి వారికి బొం బాయి, కలకత్తాల్లో శిక్షణ ఇచ్చారు. 1957లో ‘ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ’ స్థాపనతో ఆదాయపన్ను వృత్తిలో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఏర్పడింది. 1981లో ఎలక్ట్రానిక్ చలాన్ విధానం, కంప్యూటరైజేషన్ ప్రక్రియ వచ్చింది. 2009లో బెంగళూరులో ‘సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్’ రావడంతో ఒకేసారి అనేక ప్రక్రియలు చేయడం సుసాధ్యం అయింది.
2014లో జాతీ య స్థాయిలో ఆదాయపన్ను వెబ్‌సైట్ రావ డం, 2020లో ‘వివాద్ సే విశ్వాస్ స్కీమ్’ ప్రవేశపెట్టడంతో పలు సమస్యలకు పరిష్కారాలను సులభంగా ఇవ్వడం జరుగుతున్నది. 2021లో ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించారు. నేడు అర్హత కలిగిన పౌరుల నుంచి వేతనాలు, గృహ ఆస్తులు, వ్యాపారాలు, వృత్తులు, క్యాపిటల్ గేయిన్స్, ఇతర మార్గా ల్లో ఆదాయాల నుంచి నిర్ణయించిన నిష్పత్తిలో ఇన్‌కమ్ టాక్స్ వసూలు చేయడం జరుగుతోంది.
ఒకనాడు భారత కేంద్ర ప్రభుత్వానికి సాలీనా రూ.30లక్షల పన్ను వసూళ్లు నమోదు కాగా, 202 3 రూ.12.01లక్షల కోట్లు, నేడు దాదాపు రూ.20 లక్షల కోట్ల ఆదాయపన్నులు వసూలవుతున్నాయి. దేశాభివృద్ధి, దేశ భ ద్రత, పౌరసేవలు, ఆర్థికాభివృద్ధి రంగాలకు పన్ను వసూళ్లను ఖ ర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నది.
నేడు దేశవ్యాప్తంగా 165వ జాతీయ ఆదాయపన్నుల దినో త్సవం జరుపుకుంటున్న వేళ, ప్రతీ పౌరుడు తమ తమ ఆదాయాలను బట్టి పన్నులను విధిగా చెల్లించడానికి స్వచ్ఛందంగా ముందు కురావాలి. నాగరిక పౌర సమాజం ఆదాయపన్నులను స్వచ్ఛందం గా చెల్లించాలి. ఆదాయ పన్ను శాపం కాదని, అది ఒక బాధ్యత అ ని తెలుసుకోవాలి.
నేటి ఆధునిక పౌర సమాజంలో ఆదాయపన్ను ల ఎగవేత ఓ గర్వంగా తీసుకోబడుతున్నది. ఏ ఇతర ప్రభుత్వరంగ విభాగంలో లేని నేరస్థులు నేడు ఆదాయపన్నుల శాఖలో ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. ఒక దేశభక్తి కలిగిన పౌరుడిగా అర్హత కలిగిన ప్రతీ పౌరుడు తన వార్షికాదాయాన్ని బట్టి పన్నులు చెల్లించడానికి ముం దుకు రావాలని కోరుకుందాం.
డా.మధుసూదన్ రెడ్డి