27-09-2025 01:40:00 AM
పాట్నా, సెప్టెంబర్ 26: బీహార్‌లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ఎన్డీయే ప్రభుత్వం ‘ముఖ్యమం త్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం పది వేల చొప్పున జమ చేసింది. ఈ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని కొందరు లబ్ధిదారులతో ము చ్చటించారు.
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘మహిళలకు అందించే ఈ సాయాన్ని క్రమక్రమంగా పెంచుతాం. రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తాం’ అని నితీశ్ ప్రకటించారు. ఇక ప్రధాని మో దీ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌పై పరోక్ష వి మర్శలు చేశారు. ఈ పథకానికి 3.06 కోట్ల దరఖాస్తు లు రాగా.. తొలి దశలో 75 లక్షల మందిని ఎంపిక చేసినట్టు ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌చౌదరి తెలిపారు.