02-01-2026 12:00:00 AM
గజ్వేల్, జనవరి1: వర్గల్ మండలం నాచారం గుట్ట శివారులో మహిళ హత్యకు గురైంది. గజ్వెల్ రూరల్ సి ఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాలు. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన జోడు నర్సిములు కూతురు మంతూర్ కల్పన(26)ను ఆరు సంవత్సరాల క్రితం కన్యారం గ్రామానికి చెందిన గణేష్ కు ఇచ్చి వివాహం చేశారు. 6 నెలల క్రితం భర్త తో గొ డవలు జరగడంతో కల్పన ఇస్లాంపూర్ లోని తన తల్లి వద్ద ఉంటుంది.
బుధవారం సాయంత్రం 6 గంటలకు హెల్త్ చెక్ అప్ కోసం హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి ఇస్లాంపూర్ నుండి వెళ్ళింది. అర్ధ రాత్రి సమయం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడ చుట్టూ తాడు లేదా వైర్ తో గట్టిగ బిగించి చంపివేసి నాచారం గ్రామ శివారులో పడేసినట్లు సీఐ వెల్లడించారు. మృతురాలి తండ్రి జోడు నర్సిములు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.