22-11-2025 01:53:56 AM
ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఫలితాలతో కేటీఆర్‌కు మైండ్ దొబ్బిందని, పులకేశి లెక్కా మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఓ ఎమ్మెల్యేపై విచారణ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని, ఐఏఎస్ అధికారులను విచారించాలంటే డీవోపీటీ నుంచి అనుమతి తీసుకోవాలని అన్నారు.
రాష్ర్ట ప్రభుత్వం ఇవన్నీ తీసుకునే చట్టపరంగా ముందుకు వెళ్తోందని తెలిపారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. ఆరోపణలకు సమాధానం కాదని చెప్పారు. నీపై వచ్చిన ఆరోపణలపై మాట్లాడాలే తప్పా.. విషయాన్ని తప్పుదోవ పట్టించేలా.. సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు సరికాదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కారును జూబ్లీహిల్స్ ప్రజలు బండకేసి కొట్టినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావని మండిపడ్డారు.