24-12-2025 12:39:07 AM
పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు
తూప్రాన్, డిసెంబర్ 23 :తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ లలితా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ఆయుత చండీ యాగంలో మెదక్ ఎంపీ రఘునందన్రావు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షుడు భూమన్న గారి జానకిరామ్ గౌడ్, రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ సంఖ్య యాదగిరి, బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
నందిగామ సర్పంచ్‌ను సన్మానించిన ఎంపీ
నిజాంపేట :మెదక్ ఎంపీ రఘునందన్ రావు మంగళవారం నందిగామ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన ఆకుల స్వప్న రమేష్ ను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని గ్రామ అభివృద్ధి దిశగా ప్రతి సర్పంచ్ కృషి చేయాలని సూచించారు. బిజెపి సర్పంచ్ లకు ఎల్లవేళలా సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.