03-12-2024 12:00:00 AM
ఏకాంత ప్రదేశం పడకగది. దాన్ని సరిగ్గా పెట్టుకుంటేనే అందం, పొందిక ఏర్పడతాయి. పడకగది అనేది అన్ని వస్తువులను కలిపి ఉంచే స్టోర్‌రూమ్ కాదని గుర్తుంచుకోవాలి. మాసిన బట్టలను, ప్రతిరోజు తీసేసిన బట్టలను బెడ్ కింద పడేయొద్దు. ఆహార పదార్థాలను పడకగదిలో ఉంచకండి. పడక గదిలోనే కూర్చుని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.
మొక్కలతో అందం
మొక్కలు ఇంటి సౌందర్యాన్ని పెంచుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. బెడ్రూంలో కచ్చితంగా కనీసం రెండు మొక్కలైనా ఉండాలే చూసుకోవాలి. అంతేకానీ ఎక్కువ సంఖ్యలో ఉంచకూడదు. దాని వల్ల గది మరింత నిండినట్లు చేస్తుంది. కాబట్టి ఒక పెద్ద మొక్క లేదా రెండు చిన్న మొక్కలను ఉంచండి. దీనితో మీ అభిరుచి కూడా నెరవేరుతుంది. గది కూడా అందంగా కనిపిస్తుంది.
మొక్కలు పడుకునే ప్రదేశానికి దూరంగా ఉంచాలి. బెడ్రూంను అందంగా ఉంచేలా, ఇంట్లో తేమను గ్రహించే మొక్కలను పెంచితే బెటర్. ఎండిపోయిన మొక్కలను ఉంచడం శ్రేయస్కరం కాదు. దాంతో బెడ్రూంలోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.
బెడ్‌రూమ్ వాల్స్ ఇలా
బెడ్రూంకు అందంగా తీసుకొచ్చేవాటిలో వాల్స్ ఒకటి. ఫొటో ఫ్రేమ్‌లు, పోస్టర్లు, వాల్ క్లాక్‌లు డెకరేటివ్ షో పీస్‌లతో బెడ్రూం గోడలను అలంకరించడం అందరికీ ఇష్టం. కానీ గోడపై అనేక వస్తువులను వేలాడదీయడం వల్ల గది ప్రదర్శనను పాడుచేస్తుంది. గోడలపై అలంకరణన సమతుల్యంగా ఉంచండి. కొన్ని మంచి చిత్రాలు లేదా అద్దాలను మాత్రమే వేలాడదీయండి. చనిపోయిన వ్యక్తుల ఫోటోలు కూడా పడక గదిలో ఉండకూడదు. ప్రతికూల ఆలోచనలకు దారితీస్తుంది.
ఆఫీసు వర్క్ వద్దు
మీరు ఇంటి నుండి పనిచేస్తుంటే బెడ్రూం లోపల ఆఫీసు పనులు ప్రారంభించవద్దు. అలా చేయడం సౌకర్యవంతంగా ఉండవచ్చు. మీకు కావలసినప్పుడు మంచం మీద విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ డెస్క్‌పై చెల్లాచెదురుగా ఉన్న కాగితాలు, నివేదికలు, ఫోల్డర్‌లు మొదలైనవి ఉంటాయి. దీంతో ఇవి మంచి నిద్రకు దూరంగా ఉంచుతాయి. అలాగే బెడ్రూం చిన్నగా ఉంటే గదిలో టీవీ పెట్టవద్దు. దీనివల్ల గది మరీ చిన్నదిగా కనిపిస్తుంది.
‘గృహమే కదా స్వర్గసీమ’ అని అంటారు పెద్దలు. అయితే మనం ఎన్ని హాలిడే స్పాట్స్‌కు వెళ్లినా.. ప్రపంచమంతా చుట్టేసినా.. ఇంట్లో దొరికే ప్రశాంతత ఎక్కడా దొరకదు. అందుకే ఇంటిలోని పడక గది శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు ఇంటీరియర్ డిజైనర్స్. బెడ్రూంను అందంగా, సౌకర్యవంతంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం..
తాజా పువ్వులు
తాజాపువ్వుల నుంచి వచ్చే పరిమళం.. ఒత్తిడి ఆవరించిన శరీరానికి ఉపశమనాన్నిస్తుంది. ఫ్లవర్ వాజ్‌లో ఒకటి రెండు పువ్వుల్ని వేసి.. పడక గదిలో ఓమూలన అమరిస్తే చూడటానికి చాలా హాయిగా ఉంటుంది. అయితే ప్రతిరోజూ వాజులోని పువ్వులు ఆకులు మార్చడం కష్టమనుకుంటే కృత్రిమ పువ్వుల వాజును గదిలో ఎంచుకోవాలి.