26-01-2026 12:26:51 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్
జవహర్‌నగర్, జనవరి 25(విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ బృందావనం కాలనీ నందు బీజేపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. జవహర్‌నగర్ పరిసర ప్రాంతా ల్లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చెయ్యాలని నూతన కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ అన్నారు. అందుబాటులో కార్యలయం ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీజేపీ కార్యకర్తలు, వివిధ కాలనీల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యకర్తల ఉత్సాహం, ప్రజల హాజ రు పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో జవహర్ నగర్ ప్రాంతంలో బీజేపీ మరింత శక్తివంతంగా ఎదుగుతుందనే ఆశాభావం ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తమైంది.
ఈ కార్యక్రమంలో సంతోష్ గుప్తా, వేపుల సన్నీ, గిరి కత్తుల వెంకన్న, డాక్టర్ యాదగిరి, మల్లికార్జున్ గౌడ్, రఘురాం చారి, అనిల్ గుప్తా, కర్లపూడి జోగారావు, మాజీ కార్పొరేట్ పానుగంటి బాబు ,మహేశ్వరి గౌడ్, లలిత, లిఖిత యాదవ్, రాము నాయక్, సందీప్ ముదిరాజ్ పాల్గొన్నారు.