31-01-2026 12:35:31 AM
13 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసిన సిపిఐ అభ్యర్థులు
మహబూబాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాం గ్రెస్, మిత్రపక్షమైన సిపిఐ మధ్య మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయ డానికి సీట్ల పొత్తు విషయంలో చర్చలు కొ లిక్కి రాలేదు. దీనితో ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు విషయం అంశంలో సయోధ్య కుదరలేదు. ఫలితంగా మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 13 వార్డుల్లో సిపిఐ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చర్చల్లో రాష్ట్ర పార్టీ తరఫున సీపీఐ రాష్ట్ర సహాయ కా ర్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యద ర్శి బి. విజయ సారథి మాట్లాడుతూ హైదరాబాద్, అర్పణపల్లి, మహబూబాబాద్ లో పలు దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్, డిసిసి అధ్యక్షురాలు భూక్య ఉమ, డిసిసి మాజీ అధ్యక్షు డు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి తో సిపిఐ చర్చలు జరిపిందన్నారు. ఇంకా చర్చలు కొలిక్కి రాలేదన్నారు కాంగ్రెస్ తో గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో సిపిఐ కలిసి పని చే సిందని, ఈ ప్రాంతంలో మురళి నాయక్ , బలరాం నాయక్ గెలుపుకు సిపిఐ కృషి చే సిందన్నారు.
ప్రజా వ్యతిరేక టిఆర్‌ఎస్ ను అధికారం నుండి గద్దె దించడంలో ముందుండి పోరాడిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే అన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చి నా నేపథ్యంలో సిపిఐ కాంగ్రెస్ పలు దఫాలుగా చర్చలు జరుపుతుందని చర్చలు ఇం కా కొలిక్కి రాలేదని సిపిఐ అడిగినా డబుల్ డిజిట్ వార్డులలో అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలన్నారు. నామినేషన్ల పర్వం పూర్తి అయినందున కాంగ్రెస్ సిపిఐ తో చర్చలు జరిపి సిపిఐ కాంగ్రెస్ కలిసి పోవాలని అందుకు వేoనరేందర్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ, డిసిసి అధ్యక్షురాలు చొరవచూపి కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ అభ్యర్థులు నామినేషన్లు దాఖలచేసిన 22, 36, 23, 25, 33, 18, 19, 21, 24, 27, 29, 31, 26 వార్డుల్లో నామినేషన్ లు దా ఖలు చేశారు. ఈ 13 మంది ముందు పేర్లు పెట్టినాను అభ్యర్థుల సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిళ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాం డురంగాచారి, వరిపెల్లి వెంకన్న, తండా సం దీప్,వీర వెళ్లి వెలుగు శ్రవణ్ ,ఎండి ఫాతి మా, నర్రా శ్రావణ్, ఆబోతు అశోక్, జలగం ప్రవీణ్, ఎండి మహమూద్, వంకాయలపా టి చిరంజీవి, మేక వీరన్న, కే దాసు, రమేష్, నాగేల్లి యాకమ్మ, చిదిరాల అరుణ, నర్రా సంధ్య, చింతకుంట్ల శ్రీదేవి, వెలుగు అశ్విని, ఆబోతు సరళ, బానోత్ పావని, తోట రాజకుమారి, చిదిరాల జ్ఞానేశ్వర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.