25 March, 2026 | 2:12 AM

కేంద్రం బీసీ వ్యతిరేక వైఖరిని వీడాలి

25-03-2026 12:40 AM
  1. జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించాలి 
  2. కులగనణపై పార్లమెంటులో చర్చ పెట్టాలి 
  3. బీజేపీ, కాంగ్రెస్ రెండూ బీసీ వ్యతిరేక పార్టీలే
  4. దేశవ్యాప్తంగా బీసీ జేఏసీ ఏర్పాటు చేసి, ఉద్యమిస్తాం
  5. ఢిల్లీ ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం 
  6. జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): బీసీ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బీసీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన ప్రతిపక్షాలు కూడా విఫలం అయ్యాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ఆధ్వర్యంలో రెండోరోజు మంగళవారం బీసీ డిమాండ్ల పరిష్కారంపై తెలంగాణ, ఆంధ్ర భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మెరు పు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించి, పరిష్కరించాల్సిన అధికార ఎన్‌డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి చొరవ తీసుకోకపోవ డం దురదృష్టకరమన్నారు.

బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు, రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితి ఎత్తివేత, మహిళా బిల్లుపై పార్లమెంట్‌లో కొట్లాడాల్సిన రాహుల్‌గాంధీ మౌనం వహిస్తున్నాడని, బాధ్యత ఉన్న ప్రధాని మోడీ బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ రెండు బీసీ వ్యతిరేక పార్టీలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

త్వరలోనే 29 రాష్ట్రాల ఓబిసి ప్రతి నిధులతో సమావేశం ఏర్పాటు చేసి జాతీయస్థాయిలో ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అప్పు డు కూడా కేంద్రం స్పందించకపోతే భారత్ బంద్‌కు పిలుపు ఇస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్‌రావు మాట్లాడుతూ.. 60 శాతం జనాభా ఉన్న బీసీలను పట్టించుకోకుండా కేంద్రం వ్యవహరించడం మంచి పరిణామం కాదన్నారు.

కార్యక్రమంలో బీసీ సంక్షేమ సం ఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ సం క్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, బీసీ మ హిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్, బీసీ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల కోల్ నరేష్ ప్రజాపతి, సంచార జాతుల సంఘం అధ్యక్షులు కాటేపల్లి వీరస్వామి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడు గు మహేష్ యాదవ్, బీసీ నేతలు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, సంస్థాన్ శ్రీనివాసరావు, సంధ్యారాణి, శివకుమార్, అరగంటి నాగరాజు గౌడ్, ఉదయ నేత, గూడూరు భాస్కర్, కొప్పుల చందు, నాగరాజు, డేగల శ్రీనివాస్, కొత్త నరసింహస్వామి, బంగారు వెంకటేష్, సత్యరాజ్ గౌడ్, శివమ్మ, శైలజ తదితరులు పాల్గొన్నారు