calender_icon.png 24 December, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానేరుపై చెక్ డ్యాంలతో రైతులకు మేలు జరగదు

24-12-2025 01:39:44 AM

  1. అడవి సోమన్ పల్లి చెక్ డ్యామ్ పరిశీలనలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

చెక్ డ్యాంలు ఇప్పుడు కొట్టుకపోతుంటే రాజకీయం చేస్తున్నారు..

నాటి ప్రభుత్వ అసమర్ధతత వల్లనే కూలుతున్నయ్...

నాణ్యత లేకుండా, కమీషన్‌ల కోసమే చెక్ డ్యామ్ల నిర్మాణం జరిగింది.

ఇప్పటికీ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశాలు జారీ చేశారు

మంథని, డిసెంబర్ 23(విజయ క్రాంతి) మానేరు పై చెక్ డ్యామ్ కింది నుంచి నీళ్లు పోతున్నాయని గ్రామ రైతులు చెబుతుంటే నాడు అధికారంతో వాళ్ల నోరు మూయించడం ప్రతిఫలంగానే ఇప్పుడు చెక్ డ్యాం లు కూలిపోతున్నాయని, ఇప్పటికీ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విజిలె న్స్ ఎంక్వయిరీకి ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అ న్నారు.

మంగళవారం మంథని మండలంలో ని అడవి సోమన్ పల్లి గ్రామ సమీ పంలో నుంచి మానేరు గత బిఆర్ ఎస్ ప్ర భుత్వం లో రూ. 38 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం ఇటీవల కొట్టుకోవడం తో స్థానిక రై తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో మానేరు పై నిర్మించిన చెక్ డాం కోల్పోయిందని స్వయంగా అడవి సొమ్మును పెళ్లి గ్రామానికి చెందిన రైతులు మంత్రికి తెలుపడంతో మం త్రి శ్రీధర్ బాబు మానేరు వద్దకు నడుచుకుంటూ వెళ్లి మానేరును పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియా తో మాట్లాడుతూఈనాడు మా ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదని,నిష్పక్షపాతంగా విజిలెన్స్ విచారణ జరిపిస్తామని, అన్ని కారణా లను అన్వేషించి బయట పెడుతామని, నా డు ఏ మాఫియా కోసం ఈ అశాస్త్రీయ ని ర్మాణాలు చేపట్టారో రుజువు చేస్తామని అ న్నారు.

ఇదొక్కటే చెక్ డ్యాం కాదని, నాటి ప్ర భుత్వ హయాంలో ఎక్కడెక్కడ చెక్ డ్యామ్ లు నిర్మించారో అవన్నీ నాణ్యత లేని కారణంగానే క్రమంగా కూలిపోతున్నాయని, గత 20 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలోని గుం పుల, ఓదెల మండలంలో, ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామాలలో మానేరు పై నిర్మించిన చెక్ డ్యాములు అసలు నాణ్య త ప్రమాణాలు పాటించకుండానే సద రు కాంట్రాక్టర్లు కొంతమంది నాయకులకు అ ప్పటి ప్రభుత్వంలో కమిషన్ ఇచ్చి నాసరికంగా నిర్మించారని ఆవేదన వ్యక్తం చేశారు.

చెక్గాములతో పాటు కాలేశ్వరంలో నిర్మించిన బ్యారేజీలే కూలిపోయాయని, రాష్ట్ర ప్రజలు గమనించారు గనుకనే,వాళ్ల ప్రభుత్వమే కూ లిపోయిందని, ఈ చెక్ డ్యామ్లు కూలడం పె ద్ద లెక్క కాదని,ఎవరి లాభం కోసం.. ఎవరి స్వార్థం కోసం కట్టారో అన్ని బట్టబయలు చే స్తామని మంత్రి అన్నారు.అడవి సోమన్ ప ల్లిచెక్ డ్యామ్ కింది నుంచి నీళ్లు పోవడం వ ల్లనే ఇసుక కుంగి కూలిపోయిందని, గ్రామానికి చెందిన ప్రత్యక్ష సాక్షులే చెబుతున్నారని పకడ్బందీ విచారణ జరిపిస్తామని, విజిలెన్స్ విచారణ తప్పకుండా జరుగుతుందని, దో షులను ప్రజా క్షేత్రంలో బయటపెడుతామని మంత్రి మీడియా ముందు తెలిపారు.

మం త్రి వెంట ఇరిగేషన్ ఈఈ బలరాం, డిఈ రమేష్, పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి, గోదావరిఖని ఏసిపి రమేష్, మంత్రి సీఐ రాజు గౌడ్ ఎస్‌ఐ లు రమేష్, రవి కుమార్, మంథని ఏ ఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, విద్యుత్ నియంత్రణ మండలి స భ్యులు శశి భూషణ్ కాచే, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, మాజీ పిఎస్‌ఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు ఉప్పట్ల శ్రీనివాస్, సెగ్గం రాజేష్, లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.