calender_icon.png 27 September, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలతెల వారకముందే గ్లాసుల గలగల

27-09-2025 12:59:32 AM

- భార్ పక్కన బెల్ట్ షాప్..

- చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు 

- జాతీయ రహదారిపై నిర్వాకం 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 26, (విజయక్రాంతి):అధికారులకు అడిగినంత మా మూలు ఇస్తున్నాం... మమ్ములను అడిగే వారెవరు.. నిబంధనలతో మాకేంటి పని అ న్న చందాన ఉంది మద్యం దందా. జిల్లా కేంద్రానికి కూత వేట దూరంలో ఉన్న జాతీ య రహదారిపై నవభారత్ వద్ద తెలతెల వారకముందే గ్లాసుల గలగల జోరుగా సా గుతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ మద్యం వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవంగా మద్యం దుకాణం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

నవభారత్ బ్రాండీ షాప్ పక్కన ఉదయం 7 గంటలకే గ్లాసుల మోతలు వినబడుతున్నాయి. జాతీయ అర్హదారి పైన, కలెక్టర్ కార్యాలయానికికూతవేటు దూరంలోనే అక్రమ మద్యం దందా జోరు సాగుతోంది. రోడ్డు ప్రమాదాలకు నిలయంగా ఉన్న జాతీయ రహదారి పైనే మద్యం దందా సాగడం అధికారుల పర్యవేక్షణ లేమిని తేటతెల్లమ్ చేస్తుంది. బ్రాందీ షాప్ పక్కనే బెల్టు షాపు ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించేది.ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ సీఐ ప్రసాదను వివరణ కోరగా బెల్ట్ షాపుకు ఎలాంటి అనుమతులు లేవని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణమే బంధు చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించామన్నారు.