30-12-2025 01:03:04 AM
గిన్నెదరిలో అత్యల్పంగా 6.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తం గా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గిన్నెదరి ప్రాంతంలో సోమవారం ఉదయం కనిష్టంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. రాత్రి నుంచి ఉదయం వరకు తీవ్రమైన చలి ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు చలి తీవ్రతతో ఇబ్బంది పడుతున్నారు.