29-12-2025 01:02:18 AM
ప్రధాన కార్యదర్శి యోగి, కార్యదర్శి రమేష్ లు ఎన్నిక
వెంకటాపూర్, డిసెంబర్28,(విజయక్రాంతి):మండల కేంద్రంలోని బోజ్జనాయక్ తండాలో ఆదివారం లంబాడా కుల సంఘం కమిటీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు బానోత్ పర్తి నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎన్నికల్లో కమిటీ అధ్యక్షులుగా బానోత్ సునీల్, జరుప్ల రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బానోత్ యోగి, కార్యదర్శిగా అజ్మీర రమేష్, కమిటీ సలహదారులుగా బానోత్ రవి, జరుప్ల రమేష్ లు ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ.. లంబాడా కుల సంఘాన్ని మరింత బలోపేతం చేసి, సమాజ అభివృద్ధి, ఐక్యత, విద్యా-ఉద్యోగ అవకాశాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
తండా అభివృద్ధితో పాటు యువత సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. కమిటీ ఎన్నిక విజయవంతంగా జరగడంపై కుల పెద్దలు, మహిళలు, సంఘ సభ్యులు నూతన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జగన్ నాయక్, కపిల్, రాజేందర్, లలెందర్, రవి, గోపాల కృష్ణ, జవహర్ నాయక్, రాహుల్, రఘు, జీవన్, కరణ్ సింగ్, భజ్జా నాయక్, నరాణ్ సింగ్, నాగరాజు, కళ్యాణ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.